Today Horoscope: అబ్బబ్బా.. నేడు వారు పట్టిందల్లా బంగారమే.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope: అబ్బబ్బా.. నేడు వారు పట్టిందల్లా బంగారమే.. 12 రాశుల వారికి రాశిఫలాలు


Today Horoscope: అబ్బబ్బా.. నేడు వారు పట్టిందల్లా బంగారమే.. 12 రాశుల వారికి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా పురోగమి స్తాయి. మాట తొందర వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్ర త్తగా ఉండడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం బాగా ఉత్సాహంగా సాగిపోతుంది ఎవరినీ అతిగా నమ్మవద్దు.

 

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అలవికాని లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నా ప్రతిఫలానికి లోటుండదు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమ స్యల నుంచి బయటపడతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.  కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.

 

మిథునం (మృగశిర 2,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఊహిం చని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. బంధు మిత్రులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు.

 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో పని ఒత్తిడి, పని భారం నుంచి ఊరట లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను భుజాన వేసుకోవడం వల్ల ఫలితం ఉండదు. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవ హారాలు, పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టడం జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.  ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవు తుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడ తారు. వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

 

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది.  ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం అవసరం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకోని ఖర్చులు మీద పడతాయి.

 

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో బాధ్యతలు మారిపోతాయి. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్తి వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవ హరించాల్సి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. చేపట్టిన పనులు చాలావరకు సఫలం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

 

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడ తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్త వుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్ప డుతుంది.  వ్యాపారాల్లో పోటీదార్లతో ఇబ్బందులున్నప్పటికీ లాభాలకు లోటుండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి చిన్నపాటి అదృష్టం పడుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు బాగా బిజీగా సాగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి సమయం అనుకూలంగా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. మనసులోని ఒకటి రెండు కోరికలు నెర వేరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అను కు న్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా  తగ్గుతాయి.

 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా బాగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొద్ది శ్రమతో ముఖ్య మైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

 

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీతో బాధ్యతలు పంచుకునే అవ కాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

 

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవు తాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. కొద్ది శ్రమతో ముఖ్య మైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ఒత్తిడి ఉంటుంది.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *