BPCL Jobs 2026: డిగ్రీ అర్హతతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 వరకు జీతం

BPCL Jobs 2026: డిగ్రీ అర్హతతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 వరకు జీతం


భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 250 జూనియర్ ఎగ్జిక్యూటివ్‌, సెక్రటరీ, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను ఇంజినీరింగ్‌, అకౌంట్స్‌, క్యూఏ, అఫీషియల్‌ లాంగ్వేజ్‌ విభాగాల్లో భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ (ఇంజినీరింగ్‌) పోస్టుల సంఖ్య: 175
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ (అకౌంట్స్‌) పోస్టుల సంఖ్య: 25
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (వేసైడ్ ఎమినిటీస్) పోస్టుల సంఖ్య: 10
  • సెక్రటరీ (బీపీసీఎల్‌) పోస్టుల సంఖ్య: 08
  • అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ అస్యూరెన్స్) పోస్టుల సంఖ్య: 30
  • అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) పోస్టుల సంఖ్య: 02

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌, బీఈ, సీఏ, సీఎంఏ, ఎంఏ, ఎంఎస్సీ ఏదైనా ఒక డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 2026, ఏప్రిల్ 1వ తేదీ నాటికి 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 17, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1180 చొప్పున దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ.30,000 నుంచి రూ.1,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *