Legal Advice: పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా

Legal Advice: పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా


పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కోసం తరచుగా వివాదాలకు దిగుతుంటారు. అయితే, తల్లిదండ్రుల స్వార్జిత ఆస్తి విషయంలో వారికి పూర్తి హక్కులు ఉంటాయని చాలామందికి తెలియదు. తల్లిదండ్రులు తమ స్వార్జిత ఆస్తిని ఎవరికైనా ఇవ్వవచ్చు. అది పిల్లలకే ఇవ్వాలనే నియమం లేదు. వెంకటేశ్వర స్వామికి, టీటీడీ బోర్డుకు, అనాథలకు లేదా అనాథాశ్రమాలకు కూడా ఇవ్వగలరు. పిల్లలు ఆస్తి కోసం తల్లిదండ్రులను పీడిస్తున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో, సీనియర్ సిటిజన్ షిప్ ఆక్ట్ (సీనియర్ సిటిజన్స్ సామాజిక సంక్షేమం) ఒక ముఖ్యమైన నిబంధనను కలిగి ఉంది. ఈ చట్టం ప్రకారం, తల్లిదండ్రులు తమ స్వార్జిత ఆస్తిని పిల్లలకు గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేసిన తర్వాత, పిల్లలు వారిని సరిగ్గా చూసుకోనట్లయితే, ఆ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయవచ్చు. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం, అటువంటి సందర్భాలలో ఆస్తిని తిరిగి తల్లిదండ్రులకే అప్పగించబడుతుంది. తల్లిదండ్రుల సంరక్షణను నిర్ధారించడానికి, వారి హక్కులను కాపాడటానికి ఈ చట్టం ఎంతో తోడ్పడుతుంది, తద్వారా వారు గౌరవంగా జీవించగలరు.

మన దేశంలో “మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007” అనే చట్టం అమలులో ఉంది. ఈ చట్టం వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను వారి పిల్లలపై ఉంచుతుంది. పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తులను పంచుకునే హక్కు ఎంతైతే ఉంటుందో, వారిని చూసుకునే బాధ్యత కూడా అంతే ఉంటుందని ఈ చట్టం నిర్దేశిస్తుంది. ఎవరైనా తల్లిదండ్రుల ఆస్తులను పొంది, ఆ తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తే, బాధిత తల్లిదండ్రులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. కలెక్టర్ ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి, గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసే అధికారం కలిగి ఉంటారు. కాబట్టి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారి ఆస్తులను తీసుకోవడం చట్టరీత్యా చెల్లదు. ఆస్తి బదలాయింపు రద్దుకు దారితీస్తుంది. ఈ చట్టం వృద్ధుల హక్కులను పరిరక్షించడానికి ఉద్దేశించబడింది.

అయితే ఇక్కడే చిన్న కిటుకు ఉంది. తమ సంతానం నుంచి ఆస్తిని తిరిగి పొందాలని కోరుకునే తల్లిదండ్రులకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది కొన్ని నిబంధనలతో, రెండోది ‘లవ్ అండ్ ఎఫెక్షన్  అని ఆస్తి రాసి ఇవ్వడం. డాక్యూమెంట్‌లో ఈ రెండింటిలో దేన్నైనా పేర్కొన్నట్లయితే, పేరెంట్స్ వారి సంతానం నుంచి ఆస్తిని తిరిగి పొందవచ్చు. అలా కాకుండా కేవలం తన ఆస్తిని విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నట్లయితే దానిని రికవరీ చేయడం కష్టమని న్యాయనిపుణులు చెబుతున్నారు.

Also Read Anantha Sriram: ‘ఆ పాట 100 మిలియన్ కొట్టింది.. రాయల్టీనే రూ.19 లక్షలు వచ్చింది’ 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *