Headlines

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ.. నాని సినిమా గురించి పబ్లిక్ ఏమంటున్నారంటే..


ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న హీరోలలో నాని ఒకరు. దసరా, హిట్ ది థర్డ్ కేస్ వంటి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నాని.. ఇప్పుడు ది ప్యారడైజ్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ పీరియాడికి యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించారు. దసరా వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. మరోవైపు ఈ మూవీ నుంచి విడుదలైన ఆయా షేర్, ఏషనాగుల సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్మురేపాయి. మిలియన్ వ్యూస్ అందుకుంటూ నెట్టింట ట్రెండింగ్ అయ్యాయి. సెప్టెంబర్ 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 23న సాయంత్రం ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఇదివరకే సినిమా చూసిన అడియన్స్ సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో నాని జడల్ అనే పాత్రలో నటించగా.. ఆయన సరసన సుబ్బు పాత్రలో కయాదు లోహర్ కథానాయికగా నటించారు. ఇక జడల్ తల్లి సమ్మక్క పాత్రోల సోనాలి కులకర్ణి.. హీరో స్నేహితుడిగా సంపూర్ణేష్ బాబు నటించారు. ఇక సీనియర్ నటుడు మోహన్ బాబూ కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ఈచిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ ప్రధాన బలం అని అంటున్నారు నెటిజన్స్. ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిన పబ్లిక్ టాక్ ప్రకారం దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల మరో బ్లాక్ బస్టర్ అంటూ కామంట్స్ చేస్తున్నారు. అలాగే ఆయా షేర్ పాటకు థియేటర్లు షేక్ అవుతుండగా నాని స్టెప్పులు, అనిరుధ్ మ్యూజిక్ అదిరిపోయిందని అంటున్నారు.

ప్యారడైజ్ ఇంటర్వెల్ వరకూ మెంటల్ మాస్. అత్యంత భీకరమైన యాక్షన్ సీన్స్. నాని బీస్ట్ లుక్ అదిరిపోయింది. కమల్ హాసన్ తర్వాత జడ వేసుకుని దాన్ని ఒక ట్రెండ్ గా చేసిన ఏకైక హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా డైలాగ్ డెలివరీ వేరేలెవల్ అంటున్నారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *