Headlines

Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..


ఈమధ్య కాలంలో ఓటీటీలో సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ, హారర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రోజు రోజుకీ కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాకు మాత్రం మంచి డిమాండ్ వస్తుంది. డబ్బు, వివాహేతర సంబంధాల మోజులో పడి తమ కుటుంబాన్ని కొందరు మహిళలు ఎలా నాశనం చేసుకుంటున్నారు అనేది ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ఉడల్. మలయాళీ ఇండస్ట్రీలో డార్క్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా డైరెక్టర్ రతీష్ రఘునందన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో రచ్చ చేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..

కథ విషయానికి వస్తే.. షైనీ (దుర్గా కృష్ణ), రెజీ (జూడ్ ఆంటోని జోసెఫ్) దంపతులు. వీరికి ఐదేళ్ల కొడుకు ఉంటాడు. రెజీ తన భార్య, పిల్లాడిని తన తల్లిదండ్రులతోపాటే వదిలేసి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తాడు. అలాగే ఆమె అత్త మంచానికే పరిమితమై ఉంటుంది. దీంతో ఆమెకు సేవలు చేయడానికి రెజీ విసుక్కుంటుంది. మరోవైపు మామకు కన్ను సరిగ్గా కనిపించదు. అదే సమయంలో తన పాత కాలేజీ స్నేహితుడు (ధ్యాన్ శ్రీనివాసన్ ) తిరిగి పరిచయం కావడం.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఒక రోజు తన అత్తను ప్రియుడితో కలిసి చంపేస్తుంది. కానీ కోడలు చేసిన ఈ హత్యను తన మామ చూస్తాడు. తన భార్యను చంపిన తన కోడలిని, ఆమె ప్రియుడిని ఎలాగైనా అంతం చేయాలనుకుంటాడు. ఇక అప్పుడే అసలు కథ మొదలవుతుంది. సస్పెన్స్, థ్రిల్లర్ మధ్య ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..

ప్రియుడి ధ్యాసలో పడి తమ కుటుంబాన్ని, అలాగే తన జీవితాన్ని నాశనం చేసుకున్న ఓ కోడలి కథను తెరపై చూపించారు. ఈ చిత్రాన్ని హాజీబ్స్ ఫిల్మ్స్ బ్యానర్ పై గోకులం గోపాలన్ నిర్మిమించగా.. మనోజ్ పిల్లై సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి ప్రధాన బలం విలియం ఫ్రాన్సిస్ అందించిన మ్యూజిక్. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ అందించింది. ప్రస్తుతం ఉడల్ మూవీ సైనా ప్లే అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *