తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశికి శని, బుధ, శుక్ర, గురువుల అనుకూలత వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు చాలావరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం కావడం, మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఈ నెల మొదటి వారంలో శుక్ర, బుధులు వక్రి స్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. సొంత పనుల మీదా, కుటుంబ వ్యవహారాల మీదా శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఈ రాశివారు ద్వితీయార్థంలో ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది.