Headlines

TG RGUKT 2026 Registration: బాసర ఆర్‌జీయూకేటీలో ఆరేళ్ల బీటెక్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?

TG RGUKT 2026 Registration: బాసర ఆర్‌జీయూకేటీలో ఆరేళ్ల బీటెక్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?


హైదరాబాద్, మే 12: గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ గడువు మే 10, 2026వ తేదీతో ముగిసింది. అయితే ఈ గడువును తాజాగా పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు మే 14, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు చివరి వరకు వేచి చూడకుండా ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తన ప్రకటనలో వివరించారు. ప్రత్యేక కేటగిరీ దరఖాస్తుల స్వీకరణ (పోస్ట్ ద్వారా) మే 20తో ముగుస్తుంది. ఎంపికైన వారి జాబితాను మే 30వ తేదీన ప్రకటిస్తారు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ కేటగిరీలకు చెందిన విద్యార్ధులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.450, ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు రూ.1,500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. జూన్ 5వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకుండానే పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

కాగా బాసర ఆర్‌జీయూకేటీలో 1650 సీట్లు, మహబూబ్‌నగర్‌లో 188 ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2026వ సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 1, 2026 నాటికి 18 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఎస్సీ (SC), ఎస్టీ (ST) అభ్యర్థులకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. మెరిట్ ఆధారంగా గ్రామీణ, ప్రతిభావంతులైన విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడం లక్ష్యంగా యేటా ఆర్జీయూకేటీ ప్రవేశాలు కల్పిస్తుంది. ఆర్‌జీయూకేటీలో ఇంటిగ్రేటెడ్‌ విద్యావిధానంలో అందిస్తున్న ఆరేళ్ల బీటెక్‌ కోర్సులో మొదట రెండేళ్ల ప్రీ-యూనివర్సీటీ కోర్సు (పీయూసీ), ఆ తర్వాత నాలుగేళ్ల బీటెక్‌ కోర్సు ఉంటుంది.

  • బాసర క్యాంపస్‌లో కోర్సు వివరాలు: కెమికల్, సివిల్, సి.ఎస్.ఈ (CSE), ట్రిపుల్‌ఈ (EEE), ఈ.సి.ఈ (ECE), మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్, మెకానికల్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌
  • మహబూబ్‌నగర్‌ క్యాంపస్‌లో కోర్సు వివరాలు: కంప్యూటర్ సైన్స్ (CSE), CSE-డేటా సైన్స్, CSE-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ (AI & ML).

బాసర ఆర్‌జీయూకేటీలో ఆరేళ్ల బీటెక్ అడ్మిషన్లకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *