Headlines

Hyderabad: హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం.. చీఫ్‌ గెస్ట్‌గా సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్‌లో అమెరికా తెలుగు సంఘం (తానా – TANA) ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ 29న తానా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. నగరంలోని శిల్పకళా వేదికలో జరగనున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పది మంది ప్రముఖులను ఈ సందర్భంగా తానా పురస్కారాలతో ఘనంగా సత్కరించనుంది.

పది మంది ప్రముఖులకు తానా పురస్కారాలు

ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో అమరరాజా గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లా, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, జమీలా నిషాత్, డాక్టర్ సునీతా కృష్ణన్‌లకు పురస్కారాలు అందజేయనున్నారు. అలాగే జయధీర్ తిరుమల రావు, గడ్డం సమ్మయ్య, చింతకింది మల్లేశం, చింతల వెంకట్ రెడ్డి, దాసరి కొండప్ప తదితరులను కూడా తానా పురస్కారాలతో సత్కరించనున్నారు. సుద్దాల అశోక్ తేజకు తానా అందె శ్రీ పురస్కారం అందించనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన తెలుగు ప్రముఖులను ఒకే వేదికపై సత్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి వెల్లడించారు తెలిపారు.

తానా 25వ మహాసభలకు ఏర్పాట్లు

ఇదిలా ఉండగా తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి ఆధ్వర్యంలో తానా 25వ మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిర్వహించనున్న పురస్కారాల ప్రదానోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తానా ప్రతినిధులు తెలుగు ప్రజలకు ఆహ్వానం పలుకుతున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఈ వేడుకలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, తెలుగు సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *