Headlines

Telangana: విద్యుత్‌ షాక్‌తో మరణిస్తే ఎక్స్‌గ్రేషియా పెంపు.. TGSPDCL కీలక ప్రకటన

Telangana: విద్యుత్‌ షాక్‌తో మరణిస్తే ఎక్స్‌గ్రేషియా పెంపు.. TGSPDCL కీలక ప్రకటన


TGSPDCL: తెలంగాణ దక్షిణ విద్యుత్ సరఫరా సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) మంగళవారం కీలక ప్రకటన చేసింది. విద్యుదాఘాత మరణాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని రూ. 8 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సంభవించిన మరణాలకు వర్తిస్తుంది.

గతంలో విద్యుదాఘాత మరణాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా మొత్తం రూ. 5 లక్షలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని చట్టబద్ధమైన వారసుడికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ. 7.2 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా, రూ. 80,000ను నగదు రూపంలో చెల్లిస్తారు. అయితే జంతువుల విషయానికొస్తే, పశువులకు రూ. 40,000, మేకలు, గొర్రెలకు రూ. 7,000 చొప్పున మొత్తం ఇప్పటికీ ఉంది.

ఈ కీలక నిర్ణయం ద్వారా విద్యుత్ ప్రమాదాల్లో నష్టపోయిన సాధారణ వ్యక్తులు, రైతు కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. ప్రమాదం జరిగిన నిర్ణీత గడువులోగా బాధిత కుటుంబాలకు ఈ ఎక్స్‌గ్రేషియా సొమ్ము అందేలా చూడాలని సంబంధిత అధికారులను సంస్థ ఆదేశించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *