అక్షయ తృతియ రోజుం అందరు బంగారం కొనేందుకు గోల్డ్ షాప్‌లకు క్యూ కడితే. ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు మాత్రం వితనాల షాప్‌లకు క్యూ కడుతున్నారు. ఎదుంకటే వానాకాలం సాగు కోసం అక్షయ తృతియ నాడు విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిదని, పంట దిగుబడి కూడా బాగా వస్తుందని జిల్లా రైతులు భావిస్తున్నారు. అలా ఈరోజు కొనుగోలు చేసిన విత్తనాలను దేవుడి గదిలో ఉంచి.. జూన్ లో వర్షాలు పడగానే ఈ విత్తనాలను విత్తుకుంటారు. దీంతో పంటలో మంచి దిగుబడి వస్తుందని మా నమ్మకం అంటున్నారు ఆదిలాబాద్ రైతులు.
ఈ శుభదినాన విత్తనాలు కొనుగోలు చేస్తే బంగారం లాంటి పంట పండుతుందన్న నమ్మకంతో ప్రతి ఏటా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామంటున్నారు ఆదిలాబాద్ రైతులు. ఉదయం ఆరు గంటల నుండే సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపులు ముందు క్యూ కడుతున్నారు. దీంతో షాపులన్ని రైతులతో కిటకిటలాడుతున్నాయి. అక్షయ తృతీయ మంచిరోజు కావడంతో ఇష్టదైవానికి పూజలు చేసి వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభిస్తామని చెపుతున్నారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగయ్యే పత్తితో పాటు సోయ విత్తనాలు కొనుగోలు చేసేందుకు సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపుల వద్ద రైతన్నలు క్యూకట్టారు. వ్యాపారులు సైతం అన్నదాతను అతిథిగా బావించి శాలువా కప్పి సన్మానించి మరీ విత్తనాలను అందిస్తున్నారు. ఇది మా తాతాల కాలం నుండి ఆనవాయితీగా వస్తుందని చెపుతున్నారు విత్తన దుకాణ యజమానులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.