Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? RBI ఏం చెబుతుందో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే!

Bank Accounts: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? RBI ఏం చెబుతుందో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే!


Bank Accounts: నేటి కాలంలో బ్యాంక్ అకౌంట్ తెరవడం చాలా సులభం అయిపోయింది. ఉద్యోగం మారినప్పుడో లేదా ఆఫర్ల కోసమో చాలామంది వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లు తెరుస్తుంటారు. అయితే, అసలు ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండవచ్చు? దీనివల్ల వచ్చే నష్టాలేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఎన్ని అకౌంట్లు ఉండవచ్చు? ఆర్బీఐ (RBI) రూల్స్ ఏం చెబుతున్నాయి?

భారత రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఇన్ని అకౌంట్లు మాత్రమే కలిగి ఉండాలనే పరిమితి ఏదీ లేదు. మీ అవసరాన్ని బట్టి ఎన్ని అకౌంట్లనైనా నిర్వహించవచ్చు. అయితే, మీరు KYC కోసం వెళ్ళినప్పుడు మీ ఆదాయ వనరులు, అకౌంట్ తెరవడానికి గల కారణాన్ని బ్యాంకులు అడిగే అవకాశం ఉంది. మనీలాండరింగ్, ఆర్థిక మోసాలను అరికట్టడానికి బ్యాంకులు ఈ చర్యలు తీసుకుంటాయి.

ఇది కూడా చదవండి: మీ ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోందా? కేవలం నిమిషాల్లో వేగాన్ని పెంచే సింపుల్ ట్రిక్స్ ఇవే!

ఇవి కూడా చదవండి

ఎక్కువ అకౌంట్లు ఉండటం వల్ల కలిగే 5 ప్రధాన నష్టాలు ఇవే:

1. మినిమమ్ బ్యాలెన్స్ భారం (Minimum Balance Issue): 

ప్రైవేట్ బ్యాంకుల్లో నెలకు సగటున రూ. 10,000 నుండి రూ. 25,000 వరకు మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలనే నిబంధన ఉంటుంది. ఒకవేళ మీకు ఇలాంటి 5 అకౌంట్లు ఉంటే కేవలం ఆ నిబంధన కోసమే మీ వద్ద ఉన్న రూ. 1 లక్ష కంటే ఎక్కువ నగదు బ్యాంకుల్లో లాక్ అయిపోతుంది. ఈ మొత్తంపై మీకు వచ్చే వడ్డీ చాలా తక్కువ. అదే మొత్తాన్ని వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. బ్యాలెన్స్ తగ్గితే బ్యాంకులు భారీగా జరిమానాలు విధిస్తాయి.

2. అదనపు ఛార్జీల వాత:

ప్రతి బ్యాంక్ తన ఏటీఎం/డెబిట్ కార్డు కోసం ఏడాదికి రూ. 150 నుండి రూ. 500 వరకు ఛార్జీ వసూలు చేస్తుంది. ఇవి కాకుండా SMS అలర్ట్ ఛార్జీలు, చెక్ బుక్ ఛార్జీలు, అలాగే వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు ఉంటాయి. మీకు 5 అకౌంట్లు ఉంటే, కేవలం ఈ సేవా రుసుముల రూపంలోనే ఏడాదికి రూ. 2,000 నుండి రూ. 4,000 వరకు నష్టపోయే అవకాశం ఉంది.

3. సైబర్ మోసాల ముప్పు:

మీకు ఎక్కువ అకౌంట్లు ఉన్నప్పుడు, వాటన్నింటి లావాదేవీలను నిరంతరం పర్యవేక్షించడం కష్టం. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా వినియోగంలో లేని అకౌంట్లనే లక్ష్యంగా చేసుకుంటారు. ఒకవేళ అకౌంట్లో మోసం జరిగినా, మీరు స్టేట్‌మెంట్ చెక్ చేయకపోతే ఆ విషయం మీకు కొన్ని నెలల వరకు తెలియకపోవచ్చు.

4. పాస్‌వర్డ్ నిర్వహణలో ఇబ్బందులు:

ఎక్కువ అకౌంట్లు అంటే ఎక్కువ నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, UPI పిన్‌లు, డెబిట్ కార్డ్ పిన్‌లు అని అర్థం. భద్రత కోసం ప్రతి అకౌంట్‌కు వేర్వేరు పాస్‌వర్డ్ ఉండాలి. కానీ వాటన్నింటినీ గుర్తుంచుకోవడం కష్టం. ఈ క్రమంలో చాలామంది పాస్‌వర్డ్‌లను ఎక్కడో ఒకచోట రాసి పెడుతుంటారు లేదా అందరూ ఊహించగలిగే సులభమైన పాస్‌వర్డ్‌లు పెడుతుంటారు. ఇది భద్రత పరంగా చాలా ప్రమాదకరం.

5. క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం:

ఒకవేళ మీరు ఏదైనా అకౌంట్‌ను పట్టించుకోకుండా వదిలేసి, అందులో బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే పడే జరిమానాల వల్ల మీ ఖాతా ‘నెగిటివ్ బ్యాలెన్స్’లోకి వెళ్ళవచ్చు. ఇది భవిష్యత్తులో మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

నిపుణుల సలహా:

అవసరానికి మించి బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉండటం కంటే, ఒకటి లేదా రెండు అకౌంట్లను సమర్థవంతంగా నిర్వహించడం మేలు. వినియోగంలో లేని అకౌంట్లను వెంటనే క్లోజ్ చేయడం ద్వారా మీరు అనవసరపు ఛార్జీల నుండి తప్పించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: 

Delhi: ఇక పెట్రోల్ బైక్‌లు, స్కూటర్లపై నిషేధం.. 2028 నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలే..!

Gold, Silver Prices: ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. మరింత దిగజారిన వెండి!

Jasmine Plants: ఇంటి ఆవరణలో మల్లెపూల చెట్టు ఉంటే వాసనకు పాములు వస్తాయా? ఇది నిజమేనా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *