Headlines

Telangana: జస్ట్‌ 3 గంటలే.. హైదరాబాద్‌- బాసర మధ్య కొత్త రూట్‌.. ఇక దూసుకెళ్లడమే


హైదరాబాద్‌ నుంచి బాసర సరస్వతి ఆలాయానికి వెళ్తే భక్తులకు అదిరిపోయే శుభవార్త అందించి. తాజాగా హైదారాబాద్‌ నుంచి బాసరకు మరో కొత్త రూట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి బాసరకు వెళ్లాలంటే NH-44. ఈ రూట్‌లో మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా వెళ్లేవారు. కానీ రూట్‌లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది ట్రాఫిక్ జామ్ ఏర్పడేది. ముఖ్యంగా వీకెండ్స్, పండుగలు, సెలవు రోజుల్లో అయితే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లే.. గంటల సమయం ఆ ట్రాఫిక్‌లోని వేచి ఉండాల్సి వస్తుంది. ఈ ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు మరో కొత్త రహదారిని అందుబాటులోకి తెచ్చారు.

సంగారెడ్డి మీదుగా కొత్త రూట్

NH44 నుంచి కాకుండా ఇప్పుడు మీరు సంగారెడ్డి మీదుగా కూడా బాసరకు వెళ్లొచ్చు. ఇందుకోసం మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరి పటాన్‌చెరు మీదుగా NH-161 హైవే ఎక్కాలి ఇక నేరుగా సంగారెడ్డి, జోగిపేట, పిట్లం వరకు వెళ్లిన తర్వాత అక్కడ NH-161BB రహదారి ఎక్కి మద్నూర్ నుంచి బోధన్ మీదుగా బాసరకు వెళ్లాలి. అంటే మీరు హైదరాబాద్‌ నుంచి బాసరకు వెళ్లాలంటే రెండు హైవేలు చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. దాదాపు ఈ రూట్‌లో హైదరాబాద్‌ నుంచి బాసర మధ్య దూరం దాదాపు 200కి. మీ వరకు ఉండొచ్చు.. అంటే సాధారణ ట్రాఫిక్ ఉంటే మీరు 3-4 గంటల్లో హైదరాబాద్‌ నుంచి బాసరకు రీచ్ అవ్వొచ్చు.

అదే మీరు పాత రూట్‌లో NH-44 మార్గంలో వెళ్తే హైదరాబాద్‌ నుంచి బాసరకు దాదాపు 220 నుంచి 230 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రయాణానికి ఈజీగా 4.5 నుంచి 5 గంటల సమయం పడుతోంది. అంటే కొత్త పాత రూట్‌తో పోల్చుకుంటే కొత్త రూట్‌లో గంట నుంచి రెండు గంటల వరకు సమయం ఆదా కావచ్చు. అయితే కొన్ని సార్లు ట్రాఫిక్ రద్దీని పట్టి టైం కూడా ఛేంజ్ అవ్వొచ్చు. కాబట్టి ఏ రూట్‌లో వెళ్లాలలి అనుకుంటే ముందే గూగుల్ మ్యాప్స్‌లో లైవ్ ట్రాఫిక్, రోడ్డు పరిస్థితులు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

రూట్‌ క్లారిటీగా ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *