Headlines

Bird Flu: బర్డ్ ఫ్లూ టైమ్‌లో చికెన్ తినవచ్చా?


తమిళనాడులో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కోళ్ల పెంపకంపై నిఘా పెంచడం, కొన్ని ప్రాంతాల్లో కోళ్లను తొలగించడం వంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం ప్రోటీన్ కోసం గుడ్లు, చికెన్ తినే ప్రజల్లో ఇవి సురక్షితమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే, ఒక ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వచ్చినంత మాత్రాన..సరిగ్గా వండిన కోడి మాంసం, గుడ్లను ఆహారం నుండి పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిపుణుల ప్రకారం.. బాధ్యతాయుతమైన మూలాల నుండి సేకరించి, పరిశుభ్రంగా నిర్వహించినప్పుడు సరిగ్గా వండిన చికెన్, గుడ్లు తినడానికి పూర్తిగా సురక్షితం. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వేడికి సున్నితంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించినట్లుగా, కోడి మాంసం లేదా గుడ్లను కనీసం 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా ఉడికించినప్పుడు వైరస్ పూర్తిగా నశించిపోతుంది. కాబట్టి, పచ్చిగా లేదా సరిగ్గా ఉడికించని పదార్థాలకు దూరంగా ఉండటమే ముఖ్యం. గుడ్లు, చికెన్లలో శరీరానికి అవసరమైన అధిక-నాణ్యత గల ప్రోటీన్లు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు లభిస్తాయి. ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకుండా వీటిని మానేస్తే రోజూ అందాల్సిన ప్రోటీన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఒకవేళ వీటిని తీసుకోవడం తాత్కాలికంగా మానుకోవాలనుకుంటే.. పప్పుధాన్యాలు, సోయా ఉత్పత్తులు, పాలు, పనీర్ వంటి ప్రత్యామ్నాయాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. బర్డ్ ఫ్లూ సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. నమ్మకమైన మూలాల నుంచే కోడి మాంసం, గుడ్లను కొనుగోలు చేయాలి. మాంసాన్ని కనీసం 70 డిగ్రీల సెల్సియస్ వేడితో పూర్తిగా ఉడికించాలి. పచ్చి లేదా సగం ఉడికించిన గుడ్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. వంటగదిలో పచ్చి మాంసం ఇతర పదార్థాలతో కలవకుండా జాగ్రత్తపడాలి. పచ్చి మాంసాన్ని తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. సరైన పరిశుభ్రతా పద్ధతులు పాటిస్తూ పూర్తిగా ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉదయం టీతో బిస్కెట్లు తీసుకుంటున్నారా? నెలరోజుల్లో మీ ఆరోగ్యంలో జరిగే మార్పు ఇదే!

సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే.. అలాంటి వాటిని కట్టడి చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *