Sanju vs Abhishek : టీ20 వరల్డ్ కప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ జంట స్థానాలకు ప్రస్తుతం తీవ్ర ముప్పు ఏర్పడింది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి అడుగుపెట్టడమే కాకుండా, తన అద్భుత బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకోవడమే దీనికి కారణం. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకోవడంతో అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీకి ఓపెనింగ్ స్పాట్‌పై ఒక క్లారిటీ వచ్చింది. వైభవ్ తన అద్భుత ప్రదర్శనతో టీ20 జట్టులో ఒక ఓపెనింగ్ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడు.
అభిషేక్ శర్మపై పెరుగుతున్న ఒత్తిడి
మరోవైపు గత ఐదు అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో ఒక్క పెద్ద స్కోరు కూడా చేయలేక అభిషేక్ శర్మ తీవ్రంగా తడబడుతున్నాడు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 2 బ్యాటర్‌గా ఉన్నప్పటికీ, వరుస వైఫల్యాల వల్ల అతనిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు సంజూ శాంసన్ వంటి మ్యాచ్ విన్నర్ తుది జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తుండటంతో అభిషేక్ శర్మ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు అభిషేక్‌ను పక్కన పెట్టి కఠిన నిర్ణయం తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.
శ్రీకాంత్ సంచలన కామెంట్స్
తన యూట్యూబ్ ఛానెల్లో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “వరల్డ్ కప్ నుంచి చూస్తే అంతర్జాతీయ క్రికెట్లో అభిషేక్ శర్మ బలహీనతలను ప్రత్యర్థి బౌలర్లు పసిగట్టేశారు. ఇప్పుడు అతని విషయంలో సీనియర్ సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్‌కు మళ్లీ అవకాశం దక్కుతుందని నేను భావిస్తున్నాను. 100 శాతం సంజూకు మళ్లీ పిలుపు వస్తుంది. సెలెక్టర్లు ఖచ్చితంగా గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందే” అని స్పష్టం చేశారు.
సొంత పంథాలోనే ఆడుతానన్న శాంసన్
మరోవైపు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ తన కెరీర్ ప్లానింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “భారత క్రికెట్లో నిరంతరం నడిచే అనవసర పోటీలో భాగం కాకూడదని టీ20 వరల్డ్ కప్‌కు ముందే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా వయస్సు 31 సంవత్సరాలు, దేవుడి దయ వల్ల ఎన్నో సాధించాను. ఇక మిగిలిన కెరీర్‌ను నా సొంత నిబంధనలతో ప్రశాంతంగా ఆడాలనుకుంటున్నాను. ఎలా బ్యాటింగ్ చేయాలో ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సంజూ ఏం చేయాలో సంజూయే నిర్ణయించుకుంటాడు” అని ఆయన తేల్చి చెప్పారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..