Headlines

Sampath Raj : ఆ హీరోతో ఒక్క సినిమా చేశా.. ఆయన ఆరా, లుక్స్ చూసి పడిపోయా.. టాలీవుడ్ నటుడు..


ప్రముఖ నటుడు సంపత్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో తెలుగులో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, మహేష్ బాబుతో అనుభవం, దర్శకుడు త్రివిక్రమ్‌పై తనకున్న అభిమానం, అలాగే తన వ్యక్తిగత రచనా ప్రణాళికల గురించి వివరంగా మాట్లాడారు. తెలుగు సినీ పరిశ్రమలో కొందరు అగ్రశ్రేణి హీరోలు తనను విలన్‌గా తీసుకుంటే వారికి సరితూగలేమని భావించడం వల్ల కొన్ని ప్రాజెక్టులు చేజారాయని, అయితే మహేష్ బాబు వంటి ఆత్మవిశ్వాసం ఉన్న హీరోలు అలా ఆలోచించరని సంపత్ రాజ్ తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు చిత్రంలో కలిసి నటించిన అనుభవాన్ని సంపత్ రాజ్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాకు దర్శకుడు కొరటాల శివ స్వయంగా ఫోన్ చేసి పాత్రను ఆఫర్ చేశారని, అది తనకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చిందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

మహేష్ బాబు నటన గురించి ప్రస్తావిస్తూ, అది చాలా సహజసిద్ధంగా, ఎటువంటి అతిశయం లేకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయన నటన వాస్తవికతకు అద్దం పడుతుందని, ఒక సాధారణ సంభాషణలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, మహేష్ బాబు తెరపై కూడా అదే సహజత్వాన్ని ప్రదర్శిస్తారని సంపత్ రాజ్ అన్నారు. శ్రీమంతుడులోని ఒక కన్ఫ్రంటేషన్ సన్నివేశాన్ని ఉదాహరణగా చూపిస్తూ, మహేష్ బాబు నటన తెరపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని వివరించారు. మహేష్ బాబు లుక్స్, ఆరా చూసి తాను ఫిదా అయిపోయానని చెప్పుకొచ్చారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సంపత్ రాజ్ తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

త్రివిక్రమ్ సినిమాలు తీయకపోయినా, ఆయనతో కూర్చుని మాట్లాడితే చాలని తనకు అనిపిస్తుందని తెలిపారు. త్రివిక్రమ్ ఆలోచనా విధానం, ఆయన ప్రశాంతత, అలాగే ఆయన సినిమాల్లోని బ్యూటిఫుల్ మూమెంట్స్ తనకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని పేర్కొన్నారు. త్రివిక్రమ్ లాంటి గొప్ప రచయిత మనసులోకి వెళ్లి, ఆయన ఎలా ఆలోచిస్తారో అర్థం చేసుకోవాలని తాను కోరుకుంటానని, అది తనకు ఒక క్రియేటివ్ పర్సన్‌గా ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. త్రివిక్రమ్ తనలోని రచయితను గుర్తించి, తన స్క్రిప్ట్‌ను ప్రశంసించారని, నీలో ఒక రైటర్ ఉన్నాడు, నువ్వు తప్పకుండా కథలు చెప్పాలి అని ప్రోత్సహించారని సంపత్ రాజ్ గుర్తు చేసుకున్నారు. తాను త్రివిక్రమ్ ను తరచుగా ఒక మంచి స్క్రిప్ట్ రాయమని అడుగుతూ ఉంటానని, మంచి క్యారెక్టర్ ఉంటే తప్పకుండా పిలుస్తానని త్రివిక్రమ్ హామీ ఇచ్చారని సంపత్ రాజ్ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *