Rythu Bharosa: రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు.. ఎన్నెకరాల వరకంటే?

Rythu Bharosa: రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు.. ఎన్నెకరాల వరకంటే?


రాష్ట్రంలోని రైతన్నలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అయితే ఈ ఫథకం కింద మొత్తం రూ.9వేల కోట్లను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ఎకరంలో లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఎకరానిక రూ.6వేల చొప్పున ప్రభుత్వం జమ చేసింది. తాజాగా ఇవాళ రెండో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నేడు భూపాలపల్లి పర్యటన సందర్భంగా ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.

ఇది కూడా చదవండి: మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. షూరిటీ లేకుండానే 2 లక్షల లోన్..! 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు

ఇక ఈ రెండో విడతలో ఈ విడతలో భాగంగా ఎకరానికి రూ.6వేల చొప్పున సుమారు 45,11,947 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ. 5,653 కోట్లను జమ చేయనుంది. అయితే రెండో విడతలో 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. ఈ నిధులు రైతుల ఖాతాల్లో విడతల వారీ జమ చేయనున్నట్టు తెలిపింది. అయితే ఏప్రిల్25లోపు ఎవరికైనా డబ్బులు పడకపోతే.. నేరుగా సంబంధిత మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది. అక్కడ తమ వివరాలను సరిచూసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఇది కూడా చదవండి: హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో రైళ్లు

ఇక రెండో విడత పూర్తైన వెంటనే మూడో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు సంబంధించి మూడో విడత నిధులను ఈ నెలాఖరు లోపు జమ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తైతే మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.9వేల కోట్లు జమ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టే అవుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *