RBI: బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..!

RBI: బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు.. 90 రోజులు దాటితే మొండి బాకీ.. ఇక దబిడి దిబిడే..!


RBI New Rules: భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, భవిష్యత్తులో వచ్చే ఆర్థిక నష్టాలను ముందే అంచనా వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆస్తి వర్గీకరణ, మొండి బాకీల (NPA) గుర్తింపు, ఆదాయ గుర్తింపునకు సంబంధించి కొత్త దిశానిర్దేశాలను జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుండి అమలులోకి రానున్నాయి.

ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ECL) అంటే ఏమిటి?

ఇప్పటివరకు బ్యాంకులు ఏదైనా రుణం మొండి బాకీగా మారిన తర్వాతే (నష్టం జరిగిన తర్వాత) దానికి సంబంధించిన నిధులను కేటాయించేవి. కానీ ఇకపై ‘ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్’ (ECL) విధానం అమల్లోకి వస్తుంది. అంటే ఒక రుణం భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని బ్యాంక్ భావిస్తే, ఆ నష్టం జరగకముందే దానికి సరిపడా నిధులను పక్కన పెట్టాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: రోజుకు రూ.33 చెల్లిస్తే చాలు.. ఇంటికి ఏసీ, టీవీ, ఫ్రిజ్.. శాంసంగ్‌ అదిరిపోయే ఆఫర్.. వివరాలివే!

ఇవి కూడా చదవండి

రుణ ఖాతాల వర్గీకరణ:

కొత్త నిబంధనల ప్రకారం రుణ ఖాతాలను మూడు దశలుగా విభజిస్తారు:

  • స్టేజ్ 1 (సాధారణ ఖాతాలు): ఇవి సక్రమంగా ఉన్న ఖాతాలు. రాబోయే 12 నెలల్లో వీటి వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేస్తారు.
  • స్టేజ్ 2 (ప్రమాద ఘంటికలు): కస్టమర్ చెల్లింపుల్లో జాప్యం జరిగినా లేదా ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్నా ఈ జాబితాలోకి వస్తాయి. వీటికి మొత్తం రుణ కాలానికి (Lifetime) అయ్యే నష్టాన్ని లెక్కించాలి.
  • స్టేజ్ 3 (మొండి బాకీలు): తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న లేదా 90 రోజులు దాటిన ఖాతాలు. వీటికి కూడా లైఫ్‌టైమ్ నష్టాన్ని కేటాయించాలి.

ముఖ్యమైన మార్పులు:

  1. 90 రోజుల నిబంధన: ఏదైనా అప్పు బకాయి పడి 90 రోజులు దాటితేనే దానిని ఎన్‌పీఏ (NPA) గా పరిగణిస్తారు. ఒకవేళ 30 రోజులు దాటితే దానిని ప్రమాద సూచికగా భావించి బ్యాంక్ అప్రమత్తం కావాలి.
  2. బారోవర్ లెవల్ క్లాసిఫికేషన్: గతంలో ఒక కస్టమర్ ఒక లోన్ కట్టకపోయినా, మిగిలిన లోన్లు బాగున్నట్లు చూపించే వీలుండేది. కానీ ఇకపై కస్టమర్ ఒక ప్రధాన లోన్ ఎన్‌పీఏ అయితే, ఆ కస్టమర్‌కు సంబంధించిన ఇతర రుణాలను కూడా బ్యాంకులు నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
  3. వ్యక్తిగత రుణ పరిమితి పెంపు: వ్యక్తిగత రుణాల రిస్క్ వెయిట్ ప్రయోజనం పొందే పరిమితిని రూ. 7.5 కోట్ల నుండి రూ. 10 కోట్లకు ఆర్‌బీఐ పెంచింది. దీనివల్ల రూ. 10 కోట్ల వరకు వ్యక్తిగత రుణాలు తక్కువ రిస్క్ భారం కిందకు వస్తాయి.

అమలు ఎప్పటి నుండి?

ఈ కొత్త విధానాన్ని స్వీకరించడానికి బ్యాంకులు మరింత సమయం కోరినప్పటికీ, ఆర్‌బీఐ దానిని తిరస్కరించింది. బ్యాంకులు తమ అంతర్గత వ్యవస్థలను సిద్ధం చేసుకోవడానికి ఒక సంవత్సరం సమయం ఇస్తూ, వచ్చే ఏడాది (2027) నుండి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మార్పుల వల్ల బ్యాంకుల లాభాలపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: AI AC: భారతదేశంలో ఏఐ టవర్ ఏసీ విడుదల.. 10 సెకన్లలో కూలింగ్‌.. ధర తెలిస్తే షాకవుతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *