మాస్ మహారాజా రవితేజ వెండితెరపై చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. తాజాగా రవితేజ కుమార్తె మోక్షద భూపతిరాజుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినీ తారల వారసులు తరచుగా కెమెరాల ముందుకు వస్తుంటారు, కానీ మోక్షద మాత్రం అరుదుగా మాత్రమే కనిపిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
గతంలో మోక్షదకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చినప్పుడు, ఆమె చదువుపై దృష్టి సారించిందని, మీడియాకు దూరంగా ఉండటానికే ఇష్టపడతారని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆ ఫోటోలు చూసిన అభిమానులు మాస్ రాజా గారాల పట్టి చాలా పద్ధతిగా, సింపుల్‌గా ఉందని మురిసిపోయారు. అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన ఫోటోలను పరిశీలిస్తే, మోక్షద లుక్ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఆమె ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
తాజాగా పెళ్లి వేడుకలో తన కూతురు మోక్షదతో కలిసి సండడి చేశారు రవితేజ. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో ఆమె కనిపిస్తున్న తీరు చూస్తుంటే, తండ్రికి తగ్గ తనయగా గ్లామర్ రంగంలో కూడా తనదైన ముద్ర వేయగలరని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాల్లో ఆమె చిరునవ్వు, కెమెరా ముందు ఆమె పలికిస్తున్న హావభావాలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
రవితేజ తన కుమారుడు మహాధన్‌ను ఇప్పటికే 'రాజా ది గ్రేట్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేశారు. ఇప్పుడు మోక్షద లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండటంతో, ఆమె కూడా త్వరలో సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అనే చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో మొదలైంది. అయితే దీనిపై రవితేజ కుటుంబం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం ఆమె తన ఉన్నత చదువులను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మాస్ మహారాజ రవితేజ తన కూతురు మోక్షదతో కలిసి తాజాగా ఏషియన్ సునీల్ కూతురు రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. ఇందులో బ్లాక్ డ్రెస్ లో రవితేజ కూతురు మోక్షద ఎంతో క్యూట్ గా సింపుల్ లుక్ లో కనిపిస్తూనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. హీరోయిన్స్ ని మించి అందంగా ఉంది, హీరోయిన్ అవ్వొచ్చు అని ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రిసెప్షన్ వేడుకకు రవితేజ, మోక్షదతో పాటు రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ కూడా హాజరయ్యాడు.




