తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ దళపతి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయ్ పార్టీ టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో విజయ్ పార్టీతోపాటు త్రిష పేరు సైతం మారుమోగుతుంది. ఈ విజయంలో ఆమె పాత్ర కూడా ఉందంటూ తమిళ రాజకీయా వర్గాల్లో టాక్ నడుస్తుంది. పార్టీ బలోపేతానికి, విజయ్ విజయానికి త్రిష బ్యాగ్ గ్రౌండ్ వర్క్ చేశారని కొన్ని నెలలుగా ఆమె విజయ్ వెన్నంటే ఉంటూ మద్దతు పలికారని తెలుస్తోంది. దీంతో ఎన్నికల రిజల్ట్స్ వేళ ఉదయం నుంచి ఆమె పేరు నెట్టింట వైరలవుతుంది.
ఇదిలా ఉంటే ఈరోజు త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ఉదయమే తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈరోజు రిజల్ట్స్ మనకే అని ఓ అభిమాని అనడంతో త్రిష నవ్వుతూ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో త్రిష పేరు ఎక్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అలాగే ఇప్పుడు ఎన్నికలలో విజయం సాధించిన టీవీకే అధినేత ఇంటికి చేరుకుని విజయ్ కు శుభాకాంక్షలు తెలిపింది.
ప్రస్తుతం తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి రావడం .. ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను సంచనాలు నమోదవుతున్నాయి. ఊహించని విధంగా తమిళ రాజకీయాల్లో త్రిష పేరు వినిపిస్తుంది. ఆమె త్వరలోనే పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వనున్నారని.. ముఖ్యంగా విజయ్ ప్రభుత్వంలో ఆమె కీలక పదవిలో కొనసాగనున్నారని టాక్ మొదలైంది. మొదటి నుంచి టీవీకే విజయంలో త్రిష బ్యాగ్రౌండ్ వర్క్ చేశారని సమాచారం.
ఇదంతా పక్కన పెడితే.. మరోవైపు విజయ్ చివరగా నటించిన జననాయగన్ మూవీ సైతం ట్రెండింగ్ లోకి వచ్చింది. కొన్ని నెలల నుంచి ఈ మూవీ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇదివరకే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో ఆగిపోయింది. ఓవైపు సెన్సార్ ఇష్యూ నడుస్తుండగా.. మరోవైపు ఈ సినిమా లీక్ అయ్యింది. దీంతో దీని వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని విజయ్ స్వయంగా చెప్పడం ఎన్నికల ప్రచారంలో కీలకమైంది. తనను అడ్డుకోలేక సినిమాను అడ్డుకున్నారంటూ విజయ్ చెప్పడం కూడా గమనార్హం. ఇప్పుడు ఈ సినిమా పేరు సైతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
అలాగే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. “పంబరేగగొట్టే వాడి పేరు వినే ఉంటావు.. అందులోనూ రికార్డులు సృష్టించేవాడి పేరు విన్నావా.. అతడే దళపతి”… “నేను సాధారణ మ్యాన్.. కానీ చేసే పనులన్నీ సూపర్ గా ఉంటాయి “.. “అర్హత లేనివారంతా కలిసి నిలబడ్డారు. వాళ్లు గెలవకూడదు”.. “నిన్ను నాశనం చేస్తాను.. అవమానిస్తాను అని ఎవడు చెప్పినా సరే.. తిరిగి వెళ్లే ఐడియానే లేదు. నేను వచ్చేస్తున్నా” అంటూ వచ్చే డైలాగ్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.




