భారతదేశంలో రైల్వే నెట్ వర్క్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. రైలు నెంబర్లు, బోగీలపై ఉండే నెంబర్లు, కోడ్లకు అనేక ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రతీ ట్రైన్‌ను గుర్తించేందుకు ఒక నెంబర్ కేటాయిస్తారు. మనం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఈ నెంబర్ కనిపిస్తుంది. ఈ నెంబర్ 5 అంకెలు ఉంటుంది. ఇందులో మొదటి అంకెకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ట్రైన్ ఏ రాష్ట్రం, ఏ జోన్ నుంచి వస్తుందనేది సులువుగా దీని ద్వారా గుర్తించవచ్చు. ఐదు అంకెల్లో ప్రతీ నెంబర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. మొదటి అంకె ఆ ట్రైన్ ఎక్కడ నుంచి వస్తుందనేది తెలుపుతుంది.
మొదటి నెంబర్ అర్థం ఏంటంటే..?
-మొదటి అంకె జీరోతో మొదలైతే అవి తత్కాలిక ప్రత్యేక రైళ్లుగా చెప్పవచ్చు. పండుగలు, వేసవి రద్దీ సమయాల్లో వీటిని నడుపుతారని చెప్పవచ్చు
-1తో మొదలైతే దూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్లుగా గుర్తించవచ్చు. మెయిల్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది, రాజధానిలాంటి ట్రైన్లకు ఈ నెంబర్ ఉంటుంది.
-ఇక 1తో మొదలయ్యే నెంబర్లు అయినపోయినప్పుడు సూపర్ ఫాస్ట్ రైళ్ల కోసం 2 నెంబర్ వాడతారు
-ఇక 3తో ట్రైన్ నెంబర్ ప్రారంభమైతే ముంబై, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలను కవర్ చేసే వెస్ట్రన్ రైల్వే పరిధిలోకి వస్తుందని అర్థం.
-ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ గుండా వెళ్లే రైళ్లు సెంట్రల్ రైల్వే కిందకు వస్తాయి. వీటి ట్రైన్ నెంబర్లు 4తో స్టార్ట్ అవుతాయి
-ఇక ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లే దక్షిణ మధ్య రైల్వే ట్రైన్లు 5 నెంబర్‌తో ప్రారంభమవుతాయి
-తమిళనాడు, కేరళ వైపు వెళ్లే ట్రైన్లు 6వ నెంబర్‌తో ప్రారంభమవుతాయి.
-పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల పరిధిలోని తూర్పు రైల్వేకు చెందిన ట్రైన్లు 7వ నెంబర్‌తో ప్రారంభమవుతాయి
-ఈశాన్య రాష్ట్రాల మీదుగా వెళ్లే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైళ్లు 9వ అంకెతో ప్రారంభమవుతాయి
-ఒడిశా, జార్ఖండ్ మీదుగా నడిచే సౌత్ ఈస్టర్న్ రైళ్లు 8తో ప్రారంభమవుతాయి.
-ఈ నెంబర్ల ట్రైన్ ఏ జోన్‌కు చెందినది, ఏ వైపు వెళుతుంది అనేది సులువుగా గుర్తించవచ్చు. దీని వల్ల అధికారులకు గుర్తించడం సులువుగా ఉంటుంది.