Headlines

Ramayana OTT: ఓటీటీలోకి విజువల్ వండర్ రామాయణం.. స్ట్రీమింగ్‌పై ట్విస్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్


Ramayana OTT: ఓటీటీలోకి విజువల్ వండర్ రామాయణం.. స్ట్రీమింగ్‌పై ట్విస్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్

బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట కొనసాగిస్తున్న విజువల్ వండర్ రామాయణం పార్ట్ 1 ఓటీటీ రిలీజ్‌పై చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు షాకిస్తూ, ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి రాదని ఆయన స్పష్టం చేశారు.నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ మహాకావ్యం, కేవలం మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రాల జాబితాలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. సాధారణంగా బాలీవుడ్ చిత్రాలు విడుదలైన 4 నుంచి 8 వారాల వ్యవధిలో ఓటీటీలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ‘రామాయణం’ డిజిటల్ రైట్స్‌ను జియోహాట్‌స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుందని, డిసెంబర్ 18 లేదా 25 నుంచి స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నమిత్ మల్హోత్రా ఈ ఊహాగానాలకు తెరదించారు. ఇప్పటివరకు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తోనూ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటివరకూ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇంకా ఎవరికీ అమ్మలేదు. సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నంత కాలం ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పైనే ఈ అనుభూతిని పొందాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో కచ్చితంగా ఓటీటీలోకి వస్తుంది, కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవు” అని నమిత్ మల్హోత్రా తెలిపారు.

నిర్మాత వ్యాఖ్యలను బట్టి చూస్తే డిసెంబర్‌లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే కనిపిస్తున్నాయి. ముందుగా డిజిటల్ హక్కుల విక్రయ ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రానుంది. బాక్సాఫీస్ జోరు తగ్గిన తర్వాత, బహుశా వచ్చే ఏడాది ఆరంభంలో  అంటే న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ దృశ్యకావ్యాన్ని థియేటర్లలోనే చూడాల్సి ఉంటుంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *