Headlines

కొండపైనా ‘ఎల్ నినో’ ఎఫెక్ట్..తిరుమల నీటి కష్టాలు తీరేలా సీఎం మాస్టర్ ప్లాన్!


ఎల్‌నినో ప్రభావం కారణంగా తిరుమల కొండపై నీటి నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 75 శాతం అధికంగా నీరు ఆవిరవుతుండటంతో ఐదు ప్రధాన డ్యాములలో నీటి మట్టాలు అడుగంటుతున్నాయి. ఆకాశగంగ, గోగర్భం డ్యాములు ఇప్పటికే డెడ్ స్టోరేజ్‌కు చేరుకున్నాయి. ఈ నెల 18న టీటీడీ సమర్పించిన నివేదిక ప్రకారం, తిరుమలలోని డ్యాములలో ప్రస్తుతం 3,230.62 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే వాడుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ నిల్వలు రాబోయే 110 నుంచి 116 రోజులకు మాత్రమే సరిపోతాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, గతంలో 24 గంటల పాటు ఉన్న నీటి సరఫరాను ప్రస్తుతం ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలకు తగ్గించి పొదుపు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ ముందస్తుగా అప్రమత్తమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తిరుమల పర్యటనలో నీటి పరిస్థితిని సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా, తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి తిరుమలకు అదనంగా రెండో పైప్‌లైన్ నిర్మించాలని ఆదేశించారు. అవసరమైతే కళ్యాణి డ్యామ్ నీటిని పూర్తిగా తిరుమలకే కేటాయించనున్నారు. అలాగే, హంద్రీనీవా నీటిని కళ్యాణి డ్యామ్‌కు తరలించేలా చర్యలు చేపట్టారు. తిరుపతి ప్రజలకు నీటి కొరత లేకుండా కడలేరు నుంచి కైలాసగిరి రిజర్వాయర్‌కు, సోమశిల నుంచి బాలాజీ రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టోల్ ఫీజు ఎగ్గొట్టాలని చూసారో జాగ్రత్త..!

బెట్టింగ్ వద్దు.. బాసరలో భద్రతా మంత్రం!

క్యా సీన్‌ హై.. మరుగు దొడ్లో బంగారం.. చిప్స్‌ ప్యాకెట్‌లో

14 ఏళ్ల నాగార్జున రికార్డు బ్రేక్.. తరుణ్ భాస్కర్‌ సెన్సేషన్!

సూర్య – జ్యోతిక లవ్ స్టోరీని.. లీక్‌ చేసిన లైలా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *