Ram Charan: 17 ఏళ్ల వయసు నుంచే అయ్యప్ప దీక్ష.. నాలో వచ్చిన మార్పులివే.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్

Ram Charan: 17 ఏళ్ల వయసు నుంచే అయ్యప్ప దీక్ష.. నాలో వచ్చిన మార్పులివే.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్


రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పెద్ది సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, సాయి కుమార్, దివ్యేందు త్రిపాఠి, సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటోన్న రామ్ చరణ్ లేటెస్ట్ గా ఒక అరుదైన గౌరవం అందుకున్నాడు. ప్రఖ్యాత మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్‌ పేజీపై చాలా స్టైలిష్‌గా కనిపించాడు మెగా పవర్ స్టార్. గతంలో ఇదే మ్యాగజైన్ లో జూనియర్‌ ఎన్టీఆర్‌ మెరిశారు. ఆ తర్వాత ఆ గౌరవాన్ని అందుకున్న నటుడిగా రామ్ చరణ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. ఇదే క్రమంలోనే వారికి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు చరణ్ . అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘నాన్న సూచనతో 17 ఏళ్ల వయసులోనే అయ్యప్ప దీక్షను ప్రారంభించాను. ఈ దీక్ష నా జీవితంలో క్రమశిక్షణను పెంచింది. నా ఆలోచనలను నియంత్రించడానికి ఉపయోగపడింది. అనవసరపు విషయాలకు దూరంగా ఉండి మానసిక ప్రశాంతతను పొందడానికి సహాయపడింది. నాన్న గారి నుంచి వారసత్వంతో పాటు కష్టపడి పనిచేసే తత్వాన్ని కూడా నేను పుణికిపుచ్చుకున్నాను. అందరూ 50 గంటలు కష్టపడితే, నువ్వు 100 గంటలు కష్టపడు’ అన్నదే నాన్న నాకు నేర్పిన సూత్రం. ప్రస్తుతం నేను ఒక నటుడిగానే కాకుండా బాధ్యతలు నిర్వర్తించే తండ్రిగా ఉండటమే నా మొదటి ప్రాధాన్యం’

ఇవి కూడా చదవండి

‘ఇంట్లో పిల్లలు (క్లింకార, శివరామ్, అన్వీర) చేసే అల్లరిని చూసి వాళ్లను మరింత ఎంకరేజ్‌ చేస్తాను. వారి విషయంలో నేను కాస్త రఫ్‌గానే ఆలోచిస్తాను. పిల్లలను దూకనిస్తాను.. వారు పడిపోయినప్పటికీ మళ్లీ నిలబడేలా చూస్తాను. మట్టిలో ఆటలాడినా.. ఎత్తుపల్లాలు ఎక్కినా నేను అసలు భయపడను. వాళ్లు చిన్నతనం నుంచే ధైర్యంతో పాటు సాహసం నింపుకొని పెరగాలని ఆశిస్తాను. కానీ, వాళ్ల అమ్మ చాలా సున్నితంగా చూసుకుంటుంది. పిల్లల విషయంలో ఎక్కువ కంగారుపడుతుంది. అయితే, వాళ్ల అమ్మ ఎప్పుడైనా తిట్టినప్పుడు క్లీంకార నా దగ్గరకు వచ్చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

 ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్ పేజీపై రామ్ చరణ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *