Headlines

Pitru Paksha 2026: ఈ ఏడాది పితృపక్షం ప్రారంభమయ్యేది అప్పుడే


హిందూ సంప్రదాయంలో పూర్వీకుల స్మరణకు, పితృదేవతల ఆశీస్సుల సాధనకు పితృ పక్షం (శ్రాద్ధ పక్షం) అత్యంత పవిత్రమైన సమయం. 16 రోజుల పాటు సాగే ఈ సమయంలో శ్రాద్ధం, తర్పణం, పిండప్రదానం చేయడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. 2026 పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 26న పౌర్ణమితో పితృపక్షం ప్రారంభమై, అక్టోబర్ 10న సర్వ పితృ (మహాలయ) అమావాస్యతో ముగుస్తుంది. ప్రధానంగా శ్రాద్ధ విధులు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు నిర్వహిస్తారు. ఈ రోజుల్లో పితృదేవతలకు తిల తర్పణాలు ఇవ్వడం, సంప్రదాయబద్ధంగా శ్రాద్ధ కర్మలు ఆచరించడం ఎంతో శ్రేయస్కరం. ఈ సమయంలో దానధర్మాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, గోవులు, పక్షులు, ఇతర జంతువులకు ఆహారం సమర్పించడం ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. చివరి రోజైన మహాలయ అమావాస్య అత్యంత కీలకమైనది. ఈ రోజున తమ పూర్వీకులందరినీ తలచుకుంటూ పితృతర్పణం సమర్పిస్తారు. పితృ పక్షంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఈ 16 రోజులు మాంసాహారం, మద్యాన్ని పూర్తిగా వర్జించాలి. ఉల్లి, వెల్లుల్లి వినియోగాన్ని కూడా దూరంగా ఉంచడం మంచిది. అలాగే పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు వంటి ఎలాంటి శుభకార్యాలు ఈ సమయంలో జరపకూడదు. శ్రాద్ధ పక్షంలో జుట్టు, గోళ్లు కత్తిరించుకోవడం, పెద్దలను అగౌరవపరచడం లేదా కుటుంబంలో గొడవలు పడడం చేయకూడదు. ఎంతో భక్తిశ్రద్ధలతో, చిత్తశుద్ధితో పూర్వీకులను స్మరించుకుంటూ కర్మలు ఆచరిస్తే పితృదేవతల పూర్ణాశీస్సులు, శుభఫలితాలు లభిస్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రంప్‌-జిన్‌పింగ్‌ భేటీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు

భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్‌.. హైదరాబాదీ ఆవేదన!

బ్యాంకుకు వచ్చేవాళ్లంతా కస్ట్‌మర్లే కాకపోవచ్చు.. తస్మాత్‌ జాగ్రత్త

వాష్‌రూమ్‌లో ఊహించని సీన్‌.. దెబ్బకు కళ్లు బైర్లు

చాట్‌జీపీటీలో కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఇక మీ డేటా సేఫ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *