మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన డేట్ కంటే ముందే ఈ సినిమాను తీసుకువస్తున్నారు. దీంతో ఇప్పుడు మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్ది చిత్రాన్ని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు.
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో శ్రుతి హాసన్ స్పెషల్ సాంగ్ చేయనున్నారు. ఇటీవలే ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..
పెద్ది న్యూ రిలీజ్ డేట్ ఇదే..
Grit is his story. Determination is his weapon 🔥#PEDDI WORLDWIDE RELEASE ON 4th JUNE, 2026 ❤🔥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani @IamJagguBhai @divyenndu @vriddhicinemas… pic.twitter.com/WQkXww26AP
— BuchiBabuSana (@BuchiBabuSana) May 1, 2026
ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..