చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్‌ఉమన్ అంపైర్

చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్‌ఉమన్  అంపైర్


అడ్డంకులను అధిగమించి, ఆశయాలను నిజం చేసుకోవడంలో ఉండే తృప్తి మరెందులోనూ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆ సత్యాన్ని నిరూపిస్తూ భారత క్రీడా చరిత్రలో 31 ఏళ్ల రితిక సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. దేశంలోనే తొలి ‘ట్రాన్స్‌ ఉమన్ క్రికెట్ అంపైర్‌’గా గుర్తింపు పొంది, ఆమె ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒకప్పుడు ముత్తురాజ్‌గా పిలవబడిన రితిక, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి పంజాబ్‌లో ఉద్యోగం చేసేవారు. అయితే 2019లో ఐపీఎల్ చూస్తున్నప్పుడు అంపైరింగ్‌పై కలిగిన ఆసక్తి ఆమె జీవితాన్ని మార్చివేసింది. తన సొంత ఊరైన సేలంకు తిరిగి వచ్చి, అంపైరింగ్ అధికారి జయరామన్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందారు. ఈ సమయంలో తన లింగ గుర్తింపు విషయంలో జయరామన్ దంపతులు ఇచ్చిన మద్దతు, ధైర్యంతో అంపైరింగ్‌ మీద ఫోకస్ పెట్టారు. 2024లో కోయంబత్తూరులో అంపైర్‌గా అరంగేట్రం చేసే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను గేటు వద్దే అడ్డుకున్నా, ఆ అవమానాన్ని సవాలుగా తీసుకుని ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు కోయంబత్తూరు, సేలం, నమక్కల్ జిల్లాల్లో జరుగుతున్న లీగ్ మ్యాచులకు ఆమె అంపైర్‌గా వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మైదానంలో ఆటగాళ్లు ఆమెను గౌరవంగా ‘మేడమ్’ అని పిలుస్తుండటం విశేషం. ఈ సందర్భంగా రితిక స్పందిస్తూ.. “ఆటగాళ్లు నన్ను గౌరవించడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు. ఆరుగురు తోబుట్టువుల మధ్య ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న రితిక, భవిష్యత్తులో బీసీసీఐ, ఐపీఎల్ మరియు అంతర్జాతీయ మ్యాచులకు అంపైరింగ్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో మూడో జెండర్ ప్రతినిధిగా ఆమె సాధించిన ఈ విజయం అభినందనీయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదులుతున్న రైలుపై అగ్నికీలలు.. చివరిలో షాకింగ్‌ ట్విస్ట్‌

వీడుతున్న ముంబై పుచ్చకాయ మరణాల మిస్టరీ

Singer Mangli: అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్

దేశంలో క్యాన్సర్ మరణ మృదంగం.. దడ పుట్టిస్తున్న ICMR నివేదిక

నాడు “మీసాల పిల్ల” అంటూ ఎగతాళి.. నేడు స్టేట్‌ టాపర్ గా సక్సెస్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *