తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సావిత్రి, సౌందర్య తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సెటిలైపోయింది. అయితే ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్ద వారవ్వడంతో మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. నితిన్ నటించిన తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన లయ ఆ మధ్యన శివాజీతో కలిసి సంప్రదాయనీ సుప్పిని శుద్ధపూసని సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఇప్పుడు ఆమె నటించిన మరో సినిమా వదల రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో ఆమె జగపతిబాబు భార్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
గతంలో జగపతిబాబు, లయ పలు సూపర్ హిట్ సినిమాల్లో జోడీగా నటించారు. మనోహరం, నాలో ఉన్న ప్రేమ, హనుమాన్ జంక్షన్, శివరామరాజు తదితర చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా చేశారు. ఇప్పుడు వదల సినిమాలో మరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా లయ హీరో జగపతిబాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను జగపతిబాబు ను చూసే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చానని తెలిపింది. ‘ మీరు చేసే వర్సటైల్ పెర్ఫార్మెన్స్ నాకు ఎంతో ఇన్‌స్పిరేషన్. ప్రతి సినిమాకు కొత్త లుక్, కొత్త స్టైల్‌తో కనిపిస్తారు. ప్రతి పాత్రలో పూర్తిగా ఒదిగిపోతారు. పాత్రకు 100 శాతం న్యాయం చేస్తారు. మేము కూడా సినిమాల్లో నటించేటప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతాం. హీరోయిన్లు సాధారణంగా లేడీ ఆర్టిస్టులను ఫాలో అవుతారు. కానీ నేను మాత్రం మిమ్మల్ని ఫాలో కావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీలాగా ఏ పాత్రలోనైనా ఇట్టే జీవించగలగాలి. పాత్రలో పూర్తిగా మమేకం కావాలి. జగపతిబాబు గారి లాగా నా సెకండ్ ఇన్‌స్పిరేషన్ అవకాశం కావాలి’ అని చెప్పుకొచ్చింది లయ. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
వదల సినిమా విషయానికి వస్తే.. అకెళ్ళ వి కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
ఇవి కూడా చదవండి
వదల సినిమా టీజర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.