Headlines

Peddi: బాబాయ్‌ రికార్డ్‌ను బద్దలుకొట్టిన.. అబ్బాయ్

Peddi: బాబాయ్‌ రికార్డ్‌ను బద్దలుకొట్టిన.. అబ్బాయ్


జూన్ 5న మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ పెద్దిగా మన ముందుకు రాబోతున్నాడు. ఇందుకోసం ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్‌ ఈగర్‌ గా వెయిట్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో పహిల్వాన్‌గా.. బాక్సాఫీస్ దగ్గర చేయబోయే సంచలనాన్ని ముందుగానే తలుచుకుంటూ మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ది… బాబాయ్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టిందనే వార్త బయటికి రావడంతో.. నెట్టింట సంబరాలు మొదలెట్టారు. సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ… ఓజీ. ఇప్పుడీ మూవీ రికార్డ్‌ను పెద్ది సినిమా బ్రేక్ చేసింది. నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఇప్పటివరకు ఉన్న టాప్ రికార్డులను పెద్ది దాటేసింది. గతంలో పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ, ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ సలార్ వంటి భారీ చిత్రాలు మొదటి 24 గంటల్లో సాధించిన వసూళ్లను, పెద్ది కేవలం 4 గంటల్లోనే అధిగమించడం విశేషం. నార్త్ అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్ ఈ మూవీని గ్రాండ్ గా విడుదల చేస్తోంది. దాదాపు 950కి పైగా ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha: విజయ్‌ మౌనం నాకు నచ్చదు..!

త్రిష పక్కనుంటే ఇక అంతే.. విజయ్‌ భవిష్యత్తు పై జోస్యం చెప్పిన వేణు స్వామి

కోలీవుడ్‌లో నెక్స్ట్ దళపతి ఎవరు ?? యువ హీరోలకు సవాళ్లు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *