Headlines

Peddi: పెద్ది అప్‌డేట్.. ఈసారి నమ్మేలాగే ఉందిగా

Peddi: పెద్ది అప్‌డేట్.. ఈసారి నమ్మేలాగే ఉందిగా


పెద్ది షూటింగ్ అప్‌డేట్ ఏంటి..? ఎప్పుడు అడిగినా కూడా నడుస్తోంది నడుస్తోంది అంటున్నారే కానీ ఎంత బ్యాలెన్స్ ఉందనేది మాత్రం చెప్పట్లేదు. అసలు ఈ సినిమా చెప్పిన టైమ్‌కు వస్తుందా లేదా అనే డౌట్స్ అందరిలో ఉన్నాయి. వాటన్నింటికీ ఆన్సర్ ఇచ్చేసారు దర్శకుడు బుచ్చిబాబు.. పెద్ది నుంచి ఎవరూ ఊహించని మేజర్ అప్‌డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 30 నుంచి పెద్ది వాయిదా పడ్డాక మెగా ఫ్యాన్స్‌లో తెలియని నిరాశ పెరిగిపోయింది.. దానికితోడు షూటింగ్ ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో, కనీసం జూన్‌లో అయినా వస్తుందో లేదో అనే కంగారు మొదలైంది వాళ్లలో. కానీ ఆ టెన్షన్స్ అక్కర్లేదిప్పుడు.. పెద్ది షూటింగ్‌పై పెద్ద అప్‌డేట్ ఇచ్చారు బుచ్చిబాబు. కేవలం 6 రోజులే బ్యాలెన్స్ ఉందంటూ తీపికబురు చెప్పారు. ఆరంటే ఆరు రోజులు షూట్ చేస్తే పెద్ది నుంచి రామ్ చరణ్ ఫ్రీ అయిపోవచ్చు.. అది కూడా స్పెషల్ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ పాట కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆ బ్యూటీ ఎవరో తెలిస్తే.. వారం రోజుల్లో సాంగ్ షూట్ అయిపోతుంది.. ఎలా చూసుకున్నా ఏప్రిల్‌లోనే పెద్దికి గుమ్మడికాయ్ కొట్టనున్నారు చరణ్. పెద్దిలో స్పెషల్ సాంగ్ కోసం చాలా మంది భామల పేర్లు వినిపిస్తున్నాయి. మృణాళ్ ఠాకూర్ నుంచి మొదలైన చర్చ పూజా హెగ్డే, మానస వారణాసి మీదుగా చివరికి ఇప్పుడు సంయుక్త మీనన్ దగ్గర ఆగిందని తెలుస్తుంది. ఈ బ్యూటీ దాదాపు ఫైనల్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అన్నీ కుదిర్తే ఇదే వారంలో షూటింగ్ కూడా మొదలు కానుంది. జూన్‌లో సినిమాను విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్. అన్నట్లుగానే అదే నెల్లో సినిమా వస్తుందని, అనుమానాలేం అక్కర్లేదని అభయం ఇచ్చేసారు దర్శకుడు బుచ్చిబాబు. తాజాగా చరణ్‌తో కలిసున్న సెట్ ఫోటో ఒకటి విడుదల చేసారీయన. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ లాంటి సీనియర్ నటులున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్

నా చీర లాగాడు !! నాసిక్‌ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన

లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్‌ టాపర్‌

సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా చేసింది

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *