Tollywood : 16 ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి పారిపోయింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్..

Tollywood : 16 ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి పారిపోయింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్..


టాలీవుడ్ హీరోయిన్ తేజస్వి మదివాడ తన ఇటీవలి ఇంటర్వ్యూలో జీవితంలోని ఎత్తుపల్లాలు, వ్యక్తిగత సవాళ్లు, వృత్తిపరమైన ప్రయాణం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ఈ సంవత్సరం అత్యంత ఆనందకరమైనదిగా, అదే సమయంలో అత్యంత బాధాకరమైనదిగా కూడా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. పదిహేనేళ్ల క్రితం ఇంటి నుండి పారిపోయినప్పటి నుండి తాను స్వయంగా డబ్బు సంపాదిస్తున్నానని, అయితే నిరంతర శ్రమ ఇప్పుడు అలసటను కలిగిస్తోందని వివరించారు. ప్రస్తుతం ఒక బ్రేక్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తేజస్వి తెలిపారు. తేజస్వి తన రిలేషన్‌షిప్‌లు, జనాలపై నమ్మకం గురించి కూడా చర్చించారు. జనాలను నమ్మడం, ప్రేమించడం కష్టమవుతుందని, గత సంవత్సరం నుండి ఈ పరిస్థితి మరింత పెరిగిందని ఆమె చెప్పారు. మోసపోయినప్పటికీ, మరో అవకాశం ఇచ్చే రకం తానైతే, ప్రస్తుతం అనవసరంగా సమయం కేటాయించకుండా ఆలోచిస్తున్నానని అన్నారు. డబ్బు, ప్రేమ విషయాలలో తాను తరచుగా మోసపోతానని, తనను తాను చాలా తెలివైన వ్యక్తిగా చూసినా, సులభంగా ఇతరులను నమ్ముతానని తేజస్వి అంగీకరించారు. తాను “రిచ్ కిడ్”లా కనిపించినా, వాస్తవానికి “పేద” వ్యక్తిని అని, మొహమాటం వల్ల కొన్నిసార్లు చిక్కుల్లో పడతానని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Actress Raashi: ఆ హీరోయిన్ గురించి గొప్పగా చెప్పిన రాశి.. తన పెళ్లికి వారం రోజుల ముందే మరణించిందంటూ ఎమోషనల్..

బిగ్ బాస్ షోతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, తాను రెండుసార్లు షోలో పాల్గొన్నానని చెప్పారు. తన 25వ ఏట బిగ్ బాస్ వన్‌లోకి వెళ్లినప్పుడు తన ఇమేజ్ “బబ్లీ”గా ఉండేదని, రామ్ గోపాల్ వర్మ సినిమాలో కూడా నటించానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తనను “బోల్డ్”, “ఓపెన్ మైండెడ్” వ్యక్తిగా ప్రజలు గుర్తించడానికి కారణం తన సూటిగా, స్పష్టంగా మాట్లాడే స్వభావమేనని తేజస్వి వివరించారు. తన మాటలు కొన్నిసార్లు రూడ్‌గా అనిపించవచ్చు, కానీ అవి తన నిజాయితీని, సూటిదనాన్ని ప్రతిబింబిస్తాయని ఆమె స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : వయసు 52 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆమని కామెంట్స్..

బంధాల విషయానికి వస్తే, అఖిల్, బిగ్ బాస్ సహ-పోటీదారులైన బిందు, శ్రవంతి, ఆర్యానాలతో ఇప్పుడు మునుపటి టచ్ లేదని తేజస్వి వెల్లడించారు. ఆరు నెలల పాటు ముంబైలో ఒక డిస్కవరీ షోలో పని చేశానని, ఆ తర్వాత బీబీ జోడీలో పాల్గొన్నానని తెలిపారు. నిరంతరం కలుస్తూ, పని చేస్తున్నప్పుడు బంధాలు బలంగా ఉంటాయని, అయితే జీవితంలో వేర్వేరు దిశలలో ప్రయాణించినప్పుడు ఆటోమేటిక్‌గా దూరం పెరుగుతుందని ఆమె వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *