Headlines

Paradise: రూ.200 కోట్ల గేమ్ ఆడుతున్న నాని.. ఏం జరుగుతుందో ఏమో


ప్యారడైజ్ సినిమా మొదలైన రోజు నుంచే రిస్కులు తీసుకోవడం కూడా అలవాటు చేసుకున్నారు నాని.. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో ప్రతీది చాలా భారీగానే చేస్తున్నారీయన. ఇప్పుడు బిజినెస్ కూడా.. ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ చూస్తుంటే ఒక్కొక్కరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ సినిమాతో నాని చాలా పెద్ద బాక్సాఫీస్ గేమ్ ఆడుతున్నారు. మరి అందులో సేఫ్ అవుతారా.. అసలు ఆ డీటైల్స్ ఏంటి..? ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ట్రేడ్‌లో పెద్ద చర్చే జరుగుతుంది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ 103 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే నైజాం 35 కోట్లు, సీడెడ్ 10, కోస్టల్ ఆంధ్రా 30 కోట్లతో కలిపి 75 కోట్ల బిజినెస్ జరిగిందంటున్నారు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 10 కోట్లు, అలాగే ఓవర్సీస్ రైట్స్ మరో 18 కోట్లతో వరల్డ్ వైడ్ 100 కోట్లు దాటింది ప్యారడైజ్ బిజినెస్‌. ఒకవేళ ఈ బిజినెస్ నిజమైతే గనక.. ప్యారడైజ్ హిట్ స్టేటస్ అందుకోడానికి వరల్డ్ వైడ్‌గా అక్షరాలా 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. గతంలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా కలెక్షన్లకి ఇది రెండింతలు. మీడియం రేంజ్ హీరోలలో 100 కోట్లకు పైగా బిజినెస్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమాపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ట్రైలర్ లేకపోవడంతో.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బయ్యర్లకు ముందుగానే రషెస్ చూపించారని తెలుస్తుంది. అంతేకాదు.. కంటెంట్‌పై నమ్మకంతో ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఓవర్సీస్‌లో ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. మరి ఇంత బజ్ ప్లస్ బిజినెస్‌తో వస్తున్న ప్యారడైజ్ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో సెప్టెంబర్ 24న తేలనుంది. థియేట్రికల్ రైట్స్ 103 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం, నైజాం 35 కోట్లు, సీడెడ్ 10, కోస్టల్ ఆంధ్రా 30 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లోనే 75 కోట్ల బిజినెస్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 10 కోట్లు.. ఓవర్సీస్ రైట్స్ 18 కోట్లు, వరల్డ్ వైడ్ 100 కోట్లు దాటిన ప్యారడైజ్ బిజినెస్‌, వరల్డ్ వైడ్‌గా అక్షరాలా 200 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్, మీడియం రేంజ్ హీరోలలో 100 కోట్లకు పైగా బిజినెస్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ …అభిషేక్‌ శర్మ వరల్డ్‌ రికార్డ్‌

ర్యాపిడో, ఓలా , ఊబర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!

దేశవ్యాప్తంగా పనీర్‌ బ్యాన్‌! 5 వేల లైసెన్సులు రద్దు!

UPI కొత్త నిబంధనలు.. సామాన్యులపై ప్రభావం ఎంత?

Nirmala Seetharaman: ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *