సాంబార్ పాలిటిక్స్: తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
* 1987 డిసెంబర్‌లో ఎంజీఆర్ అస్తమయం, అన్నాడీఎంకేలో ఓ అమ్మ ఆగమనం.. ద్రవిడ రాజకీయాల్లో అదొక పెను సంచలనం. * 2016 డిసెంబర్‌లో పురచ్చితలైవి జయలలిత మరణం.. అమ్మ శకం ముగిసి, చీలికలు పేలికలుగా మారి, పతనం దిశగా అన్నాడీఎంకే పయనం.. * కొత్త జెండా టీవీకే జననం.. సినిమాటిక్ పాలిటిక్స్‌కి మళ్లీ ఊపొచ్చినట్టే వచ్చి.. టోటల్ అరవ పొలిటికల్ పిక్చర్‌లో కలకలం.. కొత్తకొత్త ట్విస్టులతో ద్రవిడ రాజకీయమంతా కలగాపులగం. ఔను, అల్పపీడనం పుట్టి, వాయుగుండంగా మారి…