
AP Mega DSC 2025 Postings: ఇవాళ మెగా డీఎస్సీ అభ్యర్ధులకు నియామక పత్రాల అందజేత.. ఏర్పాట్లు పూర్తి
అమరావతి, సెప్టెంబర్ 25: రాష్ట్రచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అతిపెద్ద డీఎస్సీని విజయవంతంగా పూర్తిచేసిన కూటమి ప్రభుత్వం… ఈ రోజు (సెప్టెంబర్ 25) విజేతలకు నియమాక పత్రాలు అందించనుంది. అమరావతి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఎన్నికల…