West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం

West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం

పశ్చిమ ఆసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారత ఎగుమతులను దెబ్బతీసాయి. పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేసి ఇరాన్‌ నేత ఖమేనీని హతమార్చాయి. దాంతో ఇరాన్‌ ప్రతీకారంతో రగిలిపోతోంది. గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్‌ దేశాలకు భారత్‌ విమానాల రాకపోకలను నిలిపివేసింది. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం భారత్‌లో రెండు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకటి చమురు. రెండోది రైతులకు ఆదాయం తెచ్చిపెట్టే బాస్మతి…

Read More
Alert: ఇరాన్‌కు మద్దతుగా ఆందోళనలు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..

Alert: ఇరాన్‌కు మద్దతుగా ఆందోళనలు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మూడో రోజుకు చేరింది. బాంబులు మోతతో ఇరాన్, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేని మరణంతో అనేక దేశాల్లో షియాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆందోళనలు నిరసనలు జరుగుతున్నాయి. భారత్ లో శ్రీనగర్, లక్నో, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది….

Read More
2,000 ఏళ్ల పురాతన మమ్మీలపై CT స్కాన్‌.. రిపోర్ట్ చూసిన సైంటిస్టులే షాక్‌! వెలుగులోకి సంచలన రహస్యాలు

2,000 ఏళ్ల పురాతన మమ్మీలపై CT స్కాన్‌.. రిపోర్ట్ చూసిన సైంటిస్టులే షాక్‌! వెలుగులోకి సంచలన రహస్యాలు

పురాతన ఈజిప్టులోని మమ్మీలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యమే! ఇప్పుడు, ఆధునిక సాంకేతికత ఈ వేల సంవత్సరాల పురాతన శరీరాలలో దాగి ఉన్న సత్యాన్ని వెల్లడించడం ప్రారంభించింది. USCలోని కెక్ మెడిసిన్ పరిశోధకులు రెండు పురాతన ఈజిప్షియన్ మమ్మీల అధిక-రిజల్యూషన్ CT స్కాన్‌లను నిర్వహించారు. ఈ పరిశోధన వారి జీవితాలు, ఆరోగ్యం, మరణాల గురించి అనేక కొత్త వాస్తవాలను వెల్లడించింది. స్కాన్ చేయబడిన మమ్మీలు 330 BC ప్రాంతంలో జీవించిన పూజారి నెస్-మిన్, 190 BC ప్రాంతంలో…

Read More
Gold Rates: గంటల్లోనే సీన్ రివర్స్.. ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా..

Gold Rates: గంటల్లోనే సీన్ రివర్స్.. ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా..

బంగారం ధరలపై సీన్ రివర్స్ అయింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడటంతో రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఒక్కసారిగా ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ పరిణామంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. పసిడి ధరలు కుప్పకూలడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సోమవారం బంగారం ధరలు రూ.3,290 తగ్గాయి. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల…

Read More
Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు

Sanju Samson: మ్యాజిక్ చేసిన సంజూ శాంసన్.. వంటి చేత్తో టీమ్ ఇండియా సెమీస్‌కు

టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్స్ లో భారత్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. డూ ఆర్ డై మ్యాచ్ లో సత్తా చాటి భారత జట్టు సూపర్ విక్టరీ సాధించింది. ఈ కీలక మ్యాచ్ లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా,…

Read More
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు.. ఐసీసీ రూల్‌తో సూర్యసేనకు షాకే..?

IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు.. ఐసీసీ రూల్‌తో సూర్యసేనకు షాకే..?

IND vs ENG semifinal cancelled rule: మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ తలపడనుండగా, రెండో సెమీఫైనల్‌లో భారత్-ఇంగ్లాండ్ పోటీ పడనున్నాయి. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ ఫిబ్రవరి 5న ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాలతో రద్దయితే ఏమవుతుంది? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది? గ్రూప్ దశ, సూపర్-8 దశల్లో మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చేవారు. కానీ సెమీఫైనల్ నాకౌట్ మ్యాచ్…

Read More
Ration Card: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల నుంచి అవి కూడా.. సామాన్యులకు పండుగే..

Ration Card: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల నుంచి అవి కూడా.. సామాన్యులకు పండుగే..

రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. తెల్లకార్డు కలిగి ఉన్నవారికి గోధుమ పండిని పంపిణీ చేయనుంది. జనవరి 1వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో ప్రారంభం కాలేదు. ఈ నెల నుంచి మరికొన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో కూడా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మార్చి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరికొంతమంది పేదలకు తక్కువ ధరకే గోధుమపిండి లభించనుంది. బయట మార్కెట్లో గోధుమ పిండి కొనాలంటే బ్రాండ్‌ను బట్టి కేజీ…

Read More
Stock Market: వార్ ఎఫెక్ట్.. భారీగా కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: వార్ ఎఫెక్ట్.. భారీగా కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లు కుల్పకూలాయి. మార్కెట్లు ఉదయం ప్రారంభం కాగానే.. జెడ్ స్పీడ్‌లో సూచీలు పతనమయ్యాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌లోనే కాకుండా దుబాయ్, ఖతార్ లాంటి దేశాల్లో కూడా ఈ యుద్దంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో అస్థిరతతో కొనసాగుతున్నాయి. భారత సూచీలపై వార్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభం సమయానికే సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకుపైగా కుప్పకూలింది. సెన్సెక్స్ 1004 పాయింట్లు…

Read More
Best Couple: సున్నితమైన ప్రేమ మీన రాశి.. మీకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఈ రాశివారే..!

Best Couple: సున్నితమైన ప్రేమ మీన రాశి.. మీకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఈ రాశివారే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో కొన్ని రాశులవారు మరికొన్ని రాశులవారితోనే అత్యంత అనుకూలంగా ఉంటారు. మరికొన్ని రాశుల సంబంధాలు సాధారణంగా ఉంటాయి. ఇప్పటి వరకు 11 రాశులకు అనుకూలమైన రాశులవారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చివరిదైన 12వ రాశి మీనం గురించిన అనుకూలతల గురించి తెలుసుకుందాం. మీన రాశివారు సహజంగానే సున్నితంగా ఉంటారు. మీనరాశి వారిని ఇష్టపడే వ్యక్తి జీవితాంతం ఉత్తమ సహచరులను పొందుతారని చెబుతుంటారు. ఈ రాశివారు సహజంగా, నాటకీయంగా, విశ్వాసపాత్రంగా, గౌరవంగా, భావోద్వేగపరంగా…

Read More
Viral Video: బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

Viral Video: బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం

సోషల్ మీడియాలో పాముల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతాయి. నెట్టింట విస్తృతంగా లైకులు, షేర్లు అవుతున్నాయి. కొన్నిసార్లు, కొంతమంది పిచ్చి వ్యక్తులు పాములతోనూ వెకిలీ చేష్టాలకు పాల్పడుతుంటారు. వాటిని జోక్‌గా తీసుకుని ప్రాణాలను రిస్క్‌లో పెడుతుంటారు. మరికొందరు విషపూరిత పాములతో ప్రమాదకరంగా ఫైట్‌ చేస్తుంటారు. నాగుపాములను కూడా ఎగతాళి చేసే చాలా మంది తమను తాము హీరోలుగా పోల్చుకుంటారు. అలాంటి వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఈ సిరీస్‌లో ఒక కొత్త వీడియో కనిపించింది….

Read More