
ఆడుకుంటూ అదృశ్యమైన 5 ఏళ్ల బాలిక.. మూడు రోజల తర్వాత చెరకు తోటలో మృతదేహం లభ్యం.. తలపై బలమైన గాయాలు
ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలోని తార్కుల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బార్వా సమేరా గ్రామానికి చెందిన 5 ఏళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఇంటి బయట ఆడుకుంటోంది. అలా ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా అదృశ్యమైంది. బాలిక కుటుంబ సభ్యులు రాత్రి పొద్దుపోయే వరకు వెతికారు.. అయినా ఎక్కడా బాలిక జాడ కనిపించలేదు. తరువాత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. చెరకు తోటలో అనుమానాస్పద స్థితిలో తప్పిపోయిన బాలిక మృతదేహాన్ని పోలీసులు…