Moral Story: రూపాన్ని చూసి ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు.. అసహ్యమైన బాతు పిల్ల కథ
ఒక అందమైన వేసవి రోజున ఓ తల్లి బాతు తన గుడ్లను పొదుగుతూ ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. తన పిల్లలు ఎప్పుడు బయటకు వస్తారోనని రోజూ ఆ గుడ్లను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటిగా గుడ్లు పగిలాయి. వాటిలోంచి అందమైన చిన్న చిన్న బాతు పిల్లలు బయటకు వచ్చాయి. ‘ఆహా! నా పిల్లలు ఎంత అందంగా ఉన్నారో!’ అని తల్లి బాతు ఎంతో సంతోషించింది. ఆమె పిల్లలను లెక్కపెట్టింది. ‘ఒకటి… రెండు… మూడు……