పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని కాకుమాను బజార్ కు చెందిన అమిత్ బంగారు ఆభరణాలు తయారు చేయించి విక్రయిస్తుంటాడు. ఎప్పటి లాగే ఈ నెల ఆరో తేదిన అమిత్ ఇంటి నుండి నలభై గ్రాముల బంగారం తీసుకొని ఇంటి నుండి బయలు దేరాదు. నర్సరావుపేటతో పాటు మధ్యలో మరికొన్ని షాపుల వద్ద ఆర్డర్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత అమిత్ గుంటూరు చేరుకున్నాడు. తన వద్ద నున్న ఆర్డర్స్ ప్రకారం బంగారు ఆభరణాలు చేయించుకున్నాడు. తిరిగి వాటిని షాపులకు ఇచ్చేందుకు గుంటూరు నుండి నర్సరావుపేటకు ప్రయాణమయ్యాడు.
గుంటూరు మార్కెట్ సెంటర్ లో బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదే సమయంలో కారు వచ్చి ఆగింది. నర్సరావుపేట వెళ్లే ప్రయాణీకులు ఎక్కాలంటూ డ్రైవర్ కేకలు వేశాడు. అప్పటికే మరొక ప్రయాణీకుడు కారులో ఉండటంతో అమిత్ వెంటనే కారు ఎక్కాడు. కారులో డ్రైవర్ మహంకాళి వాసుతో పాటు మరొక వ్యక్తి అషీర్ ఉన్నాడు. కారు వేమవరం క్రాస్ దగ్గరకు వెళ్లిన తర్వాత రోడ్డున పక్కన ఆపివేసి అమిత్ వద్ద నున్న బంగారు ఆభరణాలు ఇవ్వాలంటూ వాసు, అషీర్ డిమాండ్ చేశారు. అప్పటివరకూ తోటి ప్రయాణీకుడనుకన్న వ్యక్తి కూడా డ్రైవర్ తో కలిసి పోవడంతో వారిద్దరూ ఒక్కటే అన్న విషయాన్ని అమిత్ గ్రహించాడు. అయితే రోడ్డంతా నిర్మానుష్యంగా ఉండటంతో పాటు ఇద్దరూ బంగారు ఆభరణాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో అమిత్ ఖంగు తిన్నాడు. అమిత్ తటపటాయించడంతో వాళ్లిద్దరూ అమిత్ పై దాడి చేసి బంగారు ఆభరణాలు లాక్కున్నారు. అనంతరం అతన్ని కారు నుండి తోసేసి వెళ్లిపోయారు.
కిందపడిన అమిత్ అక్కడ నుండి ఫిరంగి పురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సిసి కెమెరా విజువల్స్ సాయంతో కారు నంబర్ ను గుర్తించి వాసును అతని స్నేహితుడు అమిత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఫిరంగి పురం సిఐ భుజంగరావు అపరిచిత వ్యక్తులు వాహనాల్లో ఎక్కేందుకు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని ప్రయాణీకులు సూచించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..