Tollywood : హీరో అవుదామని వచ్చాడు.. కానీ ఇండస్ట్రీలోనే No.1 విలన్ అయ్యాడు.. 55 ఏళ్లలో 800కు పైగా సినిమాలు..
తెలుగు సినీ చరిత్రలో కైకాల సత్యనారాయణ గారి స్థానం సుస్థిరం. దాదాపు 55 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 800కు పైగా చిత్రాలలో నటించిన ఆయన, నవరసాలను అలవోకగా పండించగల విలక్షణ నటుడిగా పేరుగాంచారు. ప్రతి పాత్రను పాదరసంలా ఒదిగిపోయి చేసే ఆయన సినీ గమనం అనేక మలుపులతో కూడుకున్నది. తొలుత హీరో కావాలనే ఆశతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన సత్యనారాయణ గారికి అది సాధ్యపడలేదు. అప్పటి దర్శక దిగ్గజం విఠలాచార్య ఆయనలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి ఒక కీలకమైన…