Hyderabad: ప్రతిరోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో షాకింగ్ విజువల్స్..
నిశబ్దంగా ఉన్న అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలు.. ఆకాశంలో వెలుగులు.. ఏదైనా పండగ అనుకుంటే పొరపాటే.. అది ఆకతాయిల వెర్రి వేషాలు. హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల తిరుమల హిల్స్ జైల్ కాలనీలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ఘటనలు స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత రెండు రోజులుగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఐదుగురు యువకులు మద్యం మత్తులో కాలనీలోకి ప్రవేశిస్తున్నారు. ఎటువంటి సందర్భం లేకపోయినా ఎవరి…