Headlines

నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు.. సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్

సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలని శేఖర్ మాస్టర్ అన్నారు. జానీ మాస్టర్ సతీమణి సుమలత పై ఫెడరేషన్ కు అలాగే డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్ కి కంప్లైంట్ చేశారు శేఖర్ మాస్టర్. అలాగే సుమలత, సీనియర్ డాన్సర్ లక్షి తన పై అనుచిత వ్యాఖ్యలు చేశారని శేఖర్ మాస్టర్ పిర్యాదు చేశారు. అనంతరం శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. సుమలత, సీనియర్ డాన్సర్ లక్షి చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించాయని అన్నారు. అదేవిధంగా…

Read Full News

Telangana: తెలివిగా కొట్టేశారు.. అతి తెలివితో అడ్డంగా బుక్కయ్యారు.. అసలు ఏం జరిగిందంటే?

రాత్రి వేళ షాపు మూసేశారు.. తాళాలు వేశారు.. అంతా సేఫ్ అనుకున్నారు. కానీ తెల్లారేసరికి షాపులోని లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సులు మాయమయ్యాయి. తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దొంగలు.. నగదుతో పాటు ఏకంగా రూ.5.35 లక్షల విలువైన సిగరెట్లను ఎత్తుకెళ్లారు. అయితే, చోరీ చేసిన సొత్తును అమ్మేందుకు మళ్లీ అదే ప్రాంతానికి‌ రావడం, మరో షాపులో చోరీకి రెక్కీ నిర్వహించడంతో దొంగల ముఠా గుట్టు రట్టైంది. సిగరెట్ల కోసం రాష్ట్రాలు దాటొచ్చిన అంతర్రాష్ట్ర ముఠా…

Read Full News

అమెరికాలో 600,000 డాలర్ల మోసం కేసులో భారత సంతతి వ్యక్తి అరెస్ట్!

వాషింగ్టన్ రాష్ట్రంలోని టాకోమాలో మంజిత్ సింగ్ బేడీ ‘ఏషియన్ గ్రోసరీ స్టోర్’ పేరుతో ఒక చిన్న దుకాణం నడిపేవాడు. ఇది అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘స్నాప్’ (SNAP) అనే ఆహార సహాయ పథకం కింద అనుమతి పొందింది. అయితే, మార్చి 2024 నుంచి జూన్ 2025 మధ్య కాలంలో బేడీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేశాడు. ప్రభుత్వ సాయం అందుకునే పేద ప్రజలకు ఆహార పదార్థాలు ఇవ్వకుండా, వారి ఈబీటీ (EBT) కార్డులను స్వైప్ చేసి నేరుగా…

Read Full News

రికార్డు సృష్టించిన స్మృతి మంధాన.. అంతర్జాతీయ క్రికెట్‌లో నెం.1 బ్యాటర్‌గా రికార్డ్‌

భారత మహిళల క్రికెట్ జట్టు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది. కేవలం 64 బంతుల్లోనే 124 పరుగులు చేసి గ్రౌండ్ నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగింది. మహిళల టీ20 ఆసియా కప్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు ఇప్పుడు ఆమె…

Read Full News

Telangana Auto Drivers: ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్.. సెప్టెంబర్ 7న కీలక సమావేశం!

తెలంగాణలో ఆటో డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశాలపై చర్చించేందుకు సెప్టెంబర్ 7న సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఈ భేటీ జరగనుంది. డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆటో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరపనుంది….

Read Full News

Kings Stories: రాజుల కథతో సినిమాలు.. కాసుల వర్షం కురిపిస్తున్న ప్రేక్షకులు

ఒకప్పటి రాజుల చరిత్రను సినిమాల రూపంలో నేటి జనరేషన్‌కు అందిస్తున్నారు హీరోలు.. అలాంటి కథలకు డిమాండ్ కూడా బాగా పెరిగిందిప్పుడు. చరిత్రను మార్చేసిన కింగ్స్ కహానీలు తీస్తుంటే.. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వసూలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇద్దరు స్టార్ హీరోలు.. అదిరిపోయే రెండు బయోపిక్స్‌తో వస్తున్నారు. ఎవరా హీరోలు.. ఏంటా సినిమాలు..? ఛత్రపతి శివాజీ, శంభాజీ, శ్రీకృష్ణదేవరాయ.. వీళ్లంతా కేవలం వ్యక్తులు కాదు.. ఓ చరిత్రను కదిలించిన ధీరులు. వాళ్ళ హిస్టరీ సినిమాగా…

Read Full News

OTT Movie: ఓటీటీలో తెలుగు మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సంచలనం.. ఏకంగా 300 మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డు

ఈ వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, పళ్ల బురుసు, తాప్పీ గాంధారి, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, , ది రన్నర్, అనంతన్ కాడు వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీస్ లు ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు వెబ్…

Read Full News

ఆ సినిమా మంచి హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది. కానీ నంది అవార్డు వచ్చింది

దర్శకుడు రవి బాబు ఓ ఇంటర్వ్యూ తన కెరీర్‌లోని లోతైన అనుభవాలను, ముఖ్యంగా మనసారా పరాజయం వెనుక ఉన్న కష్టాన్ని, తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాకు కష్టపడతామని, కానీ ఫలితాలు వేరుగా ఉంటాయని ఆయన అన్నారు. మనసారా చిత్రం తనకు అత్యంత నిరాశపరిచిన వాటిలో ఒకటని, ఈ సినిమాను హీరో తండ్రి కోరిక మేరకు రూపొందించామని వివరించారు. హీరో భారీ పర్సనాలిటీ ఉన్నోడు కాదు, అతని శరీర భాషకు తగినట్లుగా కేరళ నేపథ్యం, కలరిప్పయట్టు మార్షల్…

Read Full News

Vastu Tips: ఫ్లాట్‌లో ఈ వాస్తు తప్పులు చేస్తున్నారా..? ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఇవి గుర్తుంచుకోండి!

Flat Vastu Tips Telugu: వాస్తు శాస్త్రంలో ఇంటి దిశలు, గదుల స్థానం, వస్తువుల అమరికకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో వస్తువులను సరైన ప్రదేశంలో, సరైన విధంగా అమర్చడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చాలామంది నమ్ముతారు. అదే సమయంలో కొన్ని చిన్న పొరపాట్లు ఇంటి వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇల్లు సొంతమైనదైనా, అపార్ట్‌మెంట్‌ లేదా ఫ్లాట్‌ అయినా కొన్ని ప్రాథమిక వాస్తు నియమాలను పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తారు….

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్.. చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. అధికారిక ప్రకటన

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ కు రంగం ముస్తాబైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈ సీజన్ కోసం చాలా మార్పులు చేసినట్లు రియాలిటీ షో నిర్వాహకులు చెబుతున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్…

Read Full News