నేను మద్యం సేవించి పోలీస్టేషన్‌కు రాలేదు!

నేను మద్యం సేవించి పోలీస్టేషన్‌కు రాలేదు!


సింగర్ మంగళి కేసులో భాగంగా న్యాయవాది సుబ్బారావు పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆల్కహాల్ టెస్ట్‌కు గురయ్యారు. మధ్యం సేవించి పోలీస్ స్టేషన్‌కు వచ్చి న్యూసెన్స్ చేశారనే ఆరోపణలతో పంజగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే, సుబ్బారావు ఈ ఆరోపణలను ఖండించారు. తాను మధ్యం సేవించలేదని, బ్రీత్ అనలైజర్‌లో పాజిటివ్ రాలేదని పేర్కొన్నారు. 27% ఆల్కహాల్ రీడింగ్ వచ్చింది అని పోలీసులు చెప్పగా, తాను కాఫీ తాగడం వల్ల సాధారణ వ్యక్తికి కూడా 20% వరకు రీడింగ్ వస్తుందని సుబ్బారావు వివరించారు. ఈ కేసులో మంగళి నాటకాలు ఆడుతోందని, ఆమెకు పెద్ద నెట్‌వర్క్ ఉందని సుబ్బారావు ఆరోపించారు. మంగళి తనకు క్షమాపణ చెప్పినట్లు, ఫోన్లు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తాను మీడియాకు ఆధారాలు ఇవ్వవద్దని పోలీసులు చెప్పారని, అయితే అన్ని ఆధారాలను పోలీసులకు సమర్పించిన తర్వాత ప్రెస్‌కు కూడా అందిస్తానని సుబ్బారావు అన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్‌!

ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్

షారుఖ్‌ ప్లేస్‌ని రణ్‌వీర్‌ కొట్టేస్తారా?

కోలీవుడ్‌లో సీక్వెల్స్‌ జోరు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *