OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie: నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్


ఎప్పటిలాగే ఈ శుక్రవారం (మే01) థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. తెలుగు సినిమాల విషయానికి వస్తే సంగీత్ శోభన్ రాకాస, శర్వానంద్ బైకర్ సినిమాలు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలతో పాటు ఓ కాంట్రవర్సీ మూవీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇటీవల కాలంలో బాగా కాంట్రవర్సీ సబ్జెక్టుతో వార్తల్లో నిలిచిన సినిమా ఇదే అని చెప్పవచ్చు. రిలీజ్ కు ముందే ఈ సినిమా వివాదాల్లో నిలిచింది. కోర్టుల్లో కేసులు కూడా నడిచాయి. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాను నిలిపివేయాలని కౌంటర్ వేశాడు. ఈ సినిమా రిలీజ్ పై హై కోర్టు ముందు స్టే విధించింది. అయితే వెంటనే మేకర్స్ అప్పీల్ చేసుకోగా రిలీజ్ కు అనుమతినిచ్చింది. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది.

లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడి ప్రధానాంశాలుగా సాగే ఈ సినిమా పేరు ది కేరళ స్టోరీ 2. గతంలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన ది కేరళ స్టోరీకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. కామాఖ్య నారాయణ్ సింగ్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ 2 సినిమాలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా, సుమిత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 27 న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ఈ కాంట్రవర్సీ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

జీ5 ఓటీటీలో ది కేరళ స్టోరీ 2

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *