ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారం తప్పక తీసుకోవాలి. ఏమి తింటున్నామన్నది ఎంత ముఖ్యమో ఎలా తింటున్నాం.. ఏ సమయానికి భోజనం చేస్తున్నామన్నది కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తిని, సమయానికి భోజనం చేసినప్పటికీ.. భోజనం చేసిన వెంటనే చేసే కొన్ని పొరపాట్లు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. భోజనం తర్వాత చేసే చిన్న పొరపాట్లు మన జీర్ణవ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ అలవాట్లను సకాలంలో సరిదిద్దుకోకపోతే జీర్ణవ్యవస్థ క్రమంగా బలహీనపడవచ్చు. కాబట్టి భోజనం చేసిన వెంటనే మీరు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
భోజనం తర్వాత ఈ తప్పులను ఎప్పుడూ చేయకూడదు
తిన్న వెంటనే నిద్రపోవడం
మీరు చేసే అతిపెద్ద తప్పులలో ఇది కూడా ఒకటి. చాలా మంది తిన్న వెంటనే నిద్రపోతుంటారు. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీని కారణంగా మీరు ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇది గుండెల్లో మంటకు కూడా కారణం కావచ్చు. కాబట్టి తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు నిద్రపోవాలి.
టీ లేదా కాఫీ తాగడం
చాలా మందికి భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఈ పొరపాటు జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగినప్పుడు వాటిలో ఉండే మూలకాలు శరీరం ఐరన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఒకవేళ మీరు టీ లేదా కాఫీ తప్పనిసరిగా తాగాలనుకుంటే భోజనం చేసిన తర్వాత కనీసం 45 నిమిషాలు ఆగండి.
ఇవి కూడా చదవండి
ఎక్కువగా నీళ్లు తాగడం
భోజనం చేసిన వెంటనే మీరు ఎక్కువగా నీళ్లు తాగకూడదు. ఇది మీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కడుపులోని జీర్ణరసాలు బలహీనపడి, జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇలా పదేపదే చేయడం జీవక్రియపై ప్రభావం చూపుతుంది. భోజనం చేసేటప్పుడు కొద్దిగా నీళ్లు తాగడం మంచిదే. కానీ భోజనం చేసిన వెంటనే ఎక్కువగా నీళ్లు తాగకుండా ఉండాలి.
తిన్న వెంటనే స్నానం చేయకూడదు
తిన్న వెంటనే స్నానం చేయకూడదు. తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ కడుపు నుంచి చర్మానికి మారుతుంది. ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేసి, జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా చల్లటి నీటితో స్నానం చేయడం మానుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి చాలా హానికరం.
నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని టీవీ9 నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు నిపుణులను సంప్రదించవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.