ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఓ రియల్ క్రైమ్ స్టోరీనే. మూఢనమ్మకాలు, చేతబడుల నేపథ్యంలో ఈ సిరీస్ ను తెరకెక్కించారు. 2018లో దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పదంగా చనిపోయారు. 9 నుంచి 71 ఏళ్ల మధ్య ఉన్న మూడు తరాలకు చెందిన వారందరూ మూకుమ్మడిగా ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంటారు. ఢిల్లీనే కాదు యావత్ భారతదేశాన్ని ఈ సంఘటన కుదిపేసింది. ఆ 11 మంది ఎలా చనిపోయారన్నదానిపై ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది? మరి ఆ 11 మంది ఎందుకు ఉరేసుకుని చనిపోయారు? అసలు అవి ఆత్మహత్యలేనా? లేకుంటే హత్యలా? లేకుంటే ఎవరైనా వారిని బలిదానాలు చేసుకునేలా ప్రేరేపించారా? అన్న నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా ఈ సిరీస్ ను రూపొందించారు మేకర్స్.
మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ లో నటించిన ఈ హిందీ సిరీస్ పేరు ఆఖరి సచ్. రాబీ గ్రేవెల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు సౌరవ్ దేవ్ కథను అందించారు. నిర్వికార్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, దనిష్ ఇక్బాల్, నిషూ దీక్షిత్, క్రితి విజ్, సంజీవ్ చోప్రా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం ఈ ఆఖరి సచ్ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునేవారికి ఆఖరి సచ్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్.. తెలుగు వెర్షన్ కూడా..
A bone chilling tale that unravels the most twisted ties of fate, trapped secrets of a family and
terrifying horrors an investigator has ever seen. Watch #HotstarSpecials #AakhriSach from 25th
August.#AakhriSachOnHotstar pic.twitter.com/8TQm0m503U— JioHotstar (@JioHotstar) August 11, 2023
కాగా ఇదే ఘటనపై హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్ పేరిట డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ కూడా ఉంది. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
في وثائقي House of Secrets: The Burari Deaths بتشوف الحادثة اللي هزّت العالم كله! قصة وفاة 11 شخص من أفراد عائلة واحدة بظروف غامضة وبنفس الوقت، التفاصيل كلها هنا. pic.twitter.com/dXk3Qn48zL
— Netflix MENA (@NetflixMENA) March 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.