OTT Movie: అప్పుడే ఓటీటీలోకి తమిళ్ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. అబ్బాస్ రీఎంట్రీ మూవీ

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి తమిళ్ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. అబ్బాస్ రీఎంట్రీ మూవీ


కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాశ్ కుమార్ లీడ్ రోల్ లో నటించిన సినిమా హ్యాపీ రాజ్. ‘లవర్’ ‘మ్యాడ్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ ఇందులో హీరోయిన్‌గా నటించింది. మరియా రాజా ఎలాంచెజియన్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో జార్జ్ మేరియన్, అబ్బాస్, అదిరిచి అరుణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో అబ్బాస్ చాలా ఏళ్ల తర్వాత ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయన హీరోయిన్ తండ్రిగా నటించడం విశేషం. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి స్పందనను రాబట్టుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించారు. ఊళ్లో తండ్రి ప్రవర్తన వల్ల హేళనకు గురయ్యే కొడుకు, తన తండ్రి పట్ల చూపే ప్రేమాభిమానాలు ఆడియెన్స్ తో కన్నీళ్లు తెప్పిస్తాయి. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ విడుదల చేయడం విశేషం.

థియేటర్లలో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి హ్యపీరాజ్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అంటే థియేటర్లలో విడుదలైన నెలలోపే ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ హ్యాపీరాజ్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక హ్యాపీరాజ్ సినిమా కథ విషయానికి వస్తే.. ఆనంద రాజ్ అలియాస్ హ్యాపీ రాజ్ (జీవీ ప్రకాష్) తన తండ్రి ప్రవర్తనతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటాడు. అయితే ఆ తర్వాత బెంగళూరు వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరుతాడు. అక్కడే కావ్య (శ్రీ గౌరీ ప్రియ)తో ప్రేమలో పడతాడు. అయితే ఈ రెండు ఫ్యామిలీల మధ్య వ్యత్యాసాలు వీరి పెళ్లికి అడ్డంగా మారుతాయి. మరి వీరి ప్రేమకథ పెళ్లి దాకా ఎలా చేరిందో తెలుసుకోవాలంటే హ్యాపీరాజ్ సినిమా చూడాల్సిందే.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో హ్యాపీరాజ్ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *