ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలవనున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవాన్ని చరిత్రలో నిలిపోయేలా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లక్షలాది మంది ప్రజల భాగస్వామ్యంతో వేడుకను విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. అంతేకాదు… సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలకు ప్లాన్ చేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల… భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం అత్యంత వైభవంగా, అదిరిపోయేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ చారిత్రాత్మక వేడుకను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు సహా మంత్రులందరూ… అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దేశం మొత్తం సౌండ్ చేసేలా ఏర్పాట్లు ఉంటాయంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Elon Musk: ఎలాన్ మస్క్ మరో సూపర్ ప్లాన్.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు!
మీకు స్మార్ట్ రేషన్ కార్డు కావాలా ?? ఈ ఒక్క పని చేయండి!