Headlines

మీకు స్మార్ట్ రేషన్ కార్డు కావాలా ?? ఈ ఒక్క పని చేయండి!

మీకు స్మార్ట్ రేషన్ కార్డు కావాలా ?? ఈ ఒక్క పని చేయండి!


తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు త్వరలోనే శుభవార్త అందించనుంది. రాష్ట్రంలోని అర్హులైన దాదాపు 1.05 కోట్ల కుటుంబాలకు పాత రేషన్ కార్డుల స్థానంలో అత్యాధునిక ‘స్మార్ట్ రేషన్ కార్డులు’ పంపిణీ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ఈ కార్డులను ఆగస్టు తొలి వారంలో లేదా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త స్మార్ట్ కార్డులు పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ‘ఈ-కేవైసీ’ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇంకా దాదాపు 5 లక్షల మంది ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో జూలై 31 నాటికి వంద శాతం ఈ-కేవైసీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. లబ్ధిదారులు తమ స్వగ్రామానికి వెళ్లే అవసరం లేకుండా, ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలోని సమీప రేషన్ దుకాణంలోనే బయోమెట్రిక్ నమోదు చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు పిల్లలకు ఈ-కేవైసీ నుంచి మినహాయింపు ఇవ్వగా, 8 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ పూర్తి చేయాల్సిందే. బయోమెట్రిక్ పడని వారు ఆధార్ కేంద్రాల్లో వివరాలు అప్‌డేట్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. గడువులోగా ఈ-కేవైసీ పూర్తయితేనే స్మార్ట్ కార్డులు జారీ అవుతాయని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..

Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *