Headlines

AP News: ఏపీ గ్యాస్‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై సిలిండర్‌ రాయితీ డబ్బులు ఆ తేదీన జమ!


AP Deepam 2.0: ఏపీ సర్కార్‌ దీపం-2 స్కీమ్‌ కింద రాష్ట్ర ప్రజలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.2,900 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.

అయితే ముందు గ్యాస్‌ వినియోగదారులు సిలిండర్లకు డబ్బులు చెల్లిస్తే.. ఆ తర్వాత రాయితీ డబ్బుల్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. కొంతకాలంగా రాయితీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో ఎప్పుడు జమ అవుతున్నాయో తెలియడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇకపై సిలిండర్ లబ్ధిదారుడు తీసుకున్న తర్వాత నెలలో నిర్ణీత తేదీన రాయితీ డబ్బులు విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే దీనిపై పౌరసరఫరాలశాఖ, ఆర్థికశాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి: House Construction: 150 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? 3 రకాల బడ్జెట్లు మీ కోసం!

ఇవి కూడా చదవండి



ఇదిలా ఉండగా, ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు..2024 అక్టోబరు 31న దీపం-2 పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఏడాదికి మూడు వంటగ్యాస్‌ సిలిండర్లు లబ్ధిదారులకు అందిస్తోంది. ఏప్రిల్ నెల నుంచి జులై నెల వరకు.. ఆగస్టు నుంచి నవంబర్ నెల వరకు.. డిసెంబర్ నుంచి మార్చి వరకు.. ఇలా మూడు సిలిండర్లు అందిస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం విడతలవారీగా రాయితీ డబ్బులను వారికి అందిస్తోంది. లబ్ధిదారుడు సిలిండర్ బుక్ చేసుకుని డబ్బులు చెల్లిస్తే గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇస్తున్నారు. ఆ తర్వాత రాయితీ కింద డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Business Ideas: మీ గ్రామంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల సాయం..!

కొత్త విధానంలో భాగంగా సెప్టెంబర్ నెలలో గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు అక్టోబర్ నెలలో నిర్ణీత తేదీన రాయితీ డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నారు. నెలలో ఏ తేదీన డబ్బులు విడుదల చేయాలో త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ప్రభుత్వం తెలిపిన ఆ తేదీనే వారి అకౌంట్లు జమ అవుతాయి. అప్పడు లబ్ధిదారులకు ముందే ఓ క్లారిటీ వస్తుంది.

ఇది కూడా చదవండి: New House Foundation Cost: కొత్త ఇల్లు నిర్మాణంలో పునాదికి ఎంత ఖర్చు అవుతుంది? సిమెంట్, ఇసుక, ఐరన్, ఇటుకలు, మేస్త్రీ ఖర్చు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *