Headlines

Naga Chaitanya : చిన్నచిన్న విషయాలకే కృంగిపోతాం.. వాళ్ల కష్టాలు చూశాక మనసు కదిలింది.. నాగచైతన్య ..


యువసామ్రాట్ నాగచైతన్య క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తండేల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ హీరో నటిస్తున్న లేటేస్ట్ మూవీ వృషకర్మ.. డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాను డిసెంబర్ 4న విడుదల చేయనున్నారు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో భాగంగా తాజాగా ట్రావెల్ వ్లాగర్ జాస్తితో కలిసి రామగిరి కొండపైకి ట్రెక్కింగ్ కు వెళ్లారు చైతూ. ఈ క్రమంలోనే తన మనసులోని ఎన్నో మాటలను పంచుకున్నారు. లైఫ్ గురించి చైతు మాట్లాడుతూ.. నగరాల్లో నివసిస్తూ మనం నిత్యం ఎదుర్కొనే చిన్నచిన్న సమస్యలకే ఎందుకు అంతలా కృంగిపోతామో అనిపిస్తుందని, వాస్తవంలో మనం ఎంతో అదృష్టవంతులమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . తండేల్ సినిమా చిత్రీకరణ సమయంలో మత్స్యకారుల జీవితాలను దగ్గరగా చూసిన తర్వాత తన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పును వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

తాను నటించిన తండేల్ చిత్రంలో మత్స్యకారుడి పాత్ర కోసం వారితో కలిసి ప్రయాణించడం, సమయం గడపడం తనకు ఎంతో కొత్త అనుభూతిని ఇచ్చిందని నాగచైతన్య తెలిపారు. వారి జీవనశైలి, సముద్రంపై ఆధారపడి సాగే వారి జీవన పోరాటాన్ని అత్యంత దగ్గరగా పరిశీలించే అవకాశం లభించిందని పేర్కొన్నారు. మత్స్యకారుల బతుకుల్లోని కష్టాలు, అనిశ్చితులు తనను తీవ్రంగా కదిలించాయని నాగచైతన్య అన్నారు. చనిపోయినా అందులోనే, బతికినా అందులోనే అయినా పని కోసం సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు, కష్టాల్లోనూ వారు పంచుకునే భావోద్వేగాలు తనను నేలపై నిలబెట్టాయని చెప్పారు. అబ్బా.. వీళ్లకు ఇన్ని కష్టాలు ఉంటాయా? అనిపించే స్థాయిలో వారి జీవితంలోని యథార్థ పరిస్థితులు తనను ఆలోచింపజేశాయని వివరించారు .

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

మనం నగర జీవితంలో అలవాటు పడి, చిన్నచిన్న విషయాలకే బాధపడుతూ ఉంటామని, కానీ మత్స్యకారుల కష్టాలను చూసిన తర్వాత మనం ఎంత సౌకర్యవంతమైన, ఆశీర్వదించబడిన జీవితాన్ని గడుపుతున్నామో స్పష్టంగా అర్థమైందని చైతన్య పేర్కొన్నారు . అలాగే తన సైలెంట్ అనేది తనలో మిస్ అండర్ స్టాండ్ అవుతుందని అన్నారు. తన గురించి రాసిన రూమర్స్ చూసి సైలెంట్ గా ఉండిపోతానని..తాను ఇంట్రోవర్ట్ అని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *