Multibagger Stock: ఒక షేరుకు 10 షేర్లు.. ఏకంగా 977 శాతం లాభాలు.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ మీదగ్గరుందా.?

Multibagger Stock: ఒక షేరుకు 10 షేర్లు.. ఏకంగా 977 శాతం లాభాలు.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ మీదగ్గరుందా.?


Avro India Stock Split: అవ్రో ఇండియా లిమిటెడ్ బోర్డు తమ ఈక్విటీ షేర్ల విభజనకు (స్టాక్ స్ప్లిట్) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 10 రూపాయల ఫేస్ వాల్యూ కలిగిన ఒక్కో షేరును, 1 రూపాయి ఫేస్ వాల్యూ కలిగిన పది షేర్లుగా విభజించనున్నారు. దీనివల్ల ఇన్వెస్టర్ల వద్ద ఉన్న షేర్ల సంఖ్య పది రెట్లు పెరుగుతుంది. కానీ, వారి మొత్తం పెట్టుబడి విలువలో మార్పు ఉండదు. ఈ ప్రక్రియ కోసం కంపెనీ 2026 మే 5వ తేదీని రికార్డు తేదీగా, ఎక్స్-డేట్‌గా నిర్ణయించింది. ఈ తేదీ నాటికి కంపెనీ షేర్లను కలిగి ఉన్న వారు మాత్రమే ఈ విభజన ప్రయోజనాన్ని పొందగలరు.

స్టాక్ పనితీరు..

గత కొన్ని నెలలుగా ఈ షేరు ధర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మాత్రం కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ షేరు సుమారు 125.15 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, 10 షేర్లుగా విడిపోతే అప్పుడు దాదాపు ఒక్కో షేర్ ధర సుమారు 12.5 రూపాయలుగా ఉండనుంది. గడిచిన వారంలో స్వల్ప వృద్ధిని కనబరిచిన ఈ స్టాక్, గత నెల రోజుల్లో 6.5 శాతం పెరిగింది. అయితే, గత ఏడాది కాలంలో సుమారు 17.77 శాతం మేర పతనాన్ని చవిచూసింది. కానీ, అసలైన మ్యాజిక్ ఐదేళ్ల కాలంలో కనిపిస్తుంది. గత ఐదేళ్లలో ఈ కంపెనీ ఏకంగా 977.68 శాతం లాభాలను పంచిపెట్టి ఇన్వెస్టర్ల సంపదను పది రెట్లు పెంచింది.

కంపెనీ ఆర్థిక స్థితిగతులు..

అవ్రో ఇండియా ఆర్థికంగా స్థిరంగా కనిపిస్తోంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 166 కోట్ల రూపాయలుగా ఉంది. రుణ ఈక్విటీ నిష్పత్తి 0.27గా ఉండటం కంపెనీకి సానుకూల అంశం. ఆదాయ మార్గాలను పరిశీలిస్తే, 2021లో 53.57 కోట్లుగా ఉన్న ఆదాయం, 2024 నాటికి 97.37 కోట్లకు చేరింది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 82.93 కోట్ల ఆదాయం, 3.04 కోట్ల లాభాన్ని గడించింది. పరిశ్రమ సగటుతో పోలిస్తే కంపెనీ విలువలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

షేర్ల విభజన వల్ల మార్కెట్లో షేర్ల లభ్యత పెరిగి, చిన్న ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేయడానికి అవకాశం కలుగుతుంది. అయితే, ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ నష్టభయాన్ని గమనించాలి. గడిచిన మూడేళ్లలో ఈ షేరు సుమారు 12 శాతం క్షీణించిన నేపథ్యంలో, ఇన్వెస్టర్లు తమ ఆర్థిక సలహాదారుల సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. షేర్ మార్కెట్ పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *